అమితాబ్ వెనుక 8 కోట్ల మంది

Update: 2017-12-11 10:43 GMT
సోషల్ మీడియా అనగానే అందరికీ యూత్ మాత్రమే గుర్తుకొస్తారు. ఇక్కడ ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది కూడా యంగ్ సెలబ్రెటీలకే అనుకుంటాం. కానీ 7 పదుల వయసు దాటిన అమితాబ్ బచ్చన్ కు సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే దిమ్మదిరగడం ఖాయం. ఇండియాలో మరే సెలబ్రెటీకి సాధ్యం కాని రీతిలో అమితాబ్ బచ్చన్ కు ఏకంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అన్నింట్లో కలిపి 8 కోట్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఇటీవలే ఆయన 80 మిలియన్ ఫాలోవర్ల క్లబ్బులో అడుగుపెట్టారు.

ఒక్క ట్విట్టర్లో మాత్రమే బిగ్-బికి 3.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఫేస్ బుక్ లో ఆయన్ని మరో 2.7 కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. ఇంకా ఇన్ స్టాగ్రామ్.. ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అన్నీ కలిపితే బిగ్-బి ఫాలోవర్ల సంఖ్య 8 కోట్లను దాటింది. రెండు దశాబ్దాల కిందట బిగ్-బి పరిస్థితి దయనీయంగా ఉండేది. సినిమా అవకాశాలు తగ్గిపోయి.. నిర్మాణ సంస్థ.. వ్యాపార సంస్థల్లో నష్టాలు వచ్చి ఆయన దివాళా తీసే పరిస్థితికి చేరుకున్నారు. ఐతే ఆ స్థితిలో డీలా పడిపోకుండా తన కెరీర్ ను సరికొత్తగా నిర్మించుకున్నారు. ఓవైపు టెలివిజన్లోకి అడుగుపెట్టి కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం చేస్తూ.. మరోవైపు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తూ.. యాడ్స్ చేస్తూ.. ఆదాయ మార్గాలు విస్తరించుకున్నారు. మళ్లీ వందల కోట్లు ఆర్జించారు. ట్రెండీగా ఉంటూ సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ పెంచుకుని తిరుగులేని స్థాయిని అందుకున్నారు. ఆయన విజయగాథ అందరికీ స్ఫూర్తి దాయకమే.
Tags:    

Similar News