IPL : పుష్ప మేనియా ఇంకా తగ్గేదిలే

తాజాగా టీం ఇండియా స్టార్‌ క్రికెటర్ జడేజా సైతం పుష్ప మేనరిజంతో ఆకట్టుకున్నాడు.;

Update: 2025-03-11 07:55 GMT

పుష్ప 2 విడుదల అయ్యి మూడు నెలలు పూర్తి అయింది. బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా రూ.1900 కోట్ల వసూళ్లను దక్కించుకున్న పుష్ప 2 మేనియా ఇంకా తగ్గలేదు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా కిస్‌ కిస్‌.. పాటతో పాటు పుష్ప డైలాగ్స్‌తో దుమ్ము లేచి పోతుంది. కేవలం సాధారణ జనాలు మాత్రమే కాకుండా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి సెలబ్రెటీలు సైతం పుష్ప 2 మేనరిజంను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా నీ అవ్వ తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్స్‌ను సందర్భం ఏదైనా ఎక్కడో ఒక చోట అంతా వాడేస్తున్నారు. తాజాగా టీం ఇండియా స్టార్‌ క్రికెటర్ జడేజా సైతం పుష్ప మేనరిజంతో ఆకట్టుకున్నాడు. అతడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అల్లు అర్జున్‌ పుష్పలో అన్నట్లుగా తగ్గేదేలే అనే డైలాగ్‌ను ఎంతో మంది సెలబ్రెటీలు చెప్పిన విషయం తెల్సిందే. తాజాగా జడేజా సైతం ఒక వీడియోను చేశాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందం నుంచి జడేజా ఏమాత్రం బ్రేక్ లేకుండా చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టుతో కలిశాడు. ఆ సమయంలో జడేజా 'జడ్డూ అంటే పేరు కాదు బ్రాండ్‌' అంటూ పుష్ప స్టైల్‌లో చెప్పిన డైలాగ్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్ సోషల్‌ మీడియా టీం ఎక్స్ ద్వారా షేర్‌ చేశారు. ఐపీఎల్‌ ప్రారంభం ముందు అన్ని జట్లు ఇలాంటి వీడియోలతో, విభిన్నమైన పోస్టర్స్‌తో తమ జట్టు అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు.

మార్చి 22 నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్‌లో పుష్ప మేనియా మరింత ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది పుష్ప గాడి బ్రాండ్‌ అంటూ అల్లు అర్జున్‌ చేసే సిగ్నల్‌ మొదలుకుని ఎన్నో పుష్పరాజ్‌ డైలాగ్స్‌, శ్రీవల్లి డైలాగ్స్ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఎంతో మంది క్రికెటర్స్ గత రెండు మూడు సంవత్సరాల కాలంలో పుష్ప ను ఎన్నో సార్లు ఇమిటేట్ చేశారు. ఏ క్రికెటర్‌ పుష్ప డైలాగ్స్‌ చెప్పినా, మేనరిజం చూపించినా అది వైరల్‌ అవుతూ ఉంటుంది. ఇంతటి క్రేజ్‌ను పుష్పకి తెచ్చి పెట్టిన సుకుమార్‌ మళ్లీ ఈ స్థాయి సినిమాను ప్రేక్షకులకు అందించగలడా అంటే కష్టమే అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడం ఒక ఎత్తు అయితే, సోషల్‌ మీడియాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెలబ్రెటీలు సైతం చెప్పే విధంగా విభిన్నమైన సింపుల్‌ డైలాగ్స్‌ ఒక ఎత్తు. పుష్ప డైలాగ్స్‌తో నేషనల్‌ సెలబ్రెటీలు చేసిన వీడియోల కారణంగానే మరింతగా క్రేజ్ దక్కింది. పుష్ప కి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు సుకుమార్‌ ముందు ముందు తీయబోతున్న సినిమాలకు వస్తుందా అంటే కచ్చితంగా కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అద్భుతాలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటాయి. కనుక పుష్ప మ్యాజిక్ మళ్లీ ఆ స్థాయిలో క్రియేట్‌ చేయడం మరే సినిమాకు సాధ్యం కాకపోవచ్చు. ఒక వేళ పుష్ప 3 వచ్చినా ఈ స్థాయి ఆధరణ కష్టమే అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News