పిక్‌టాక్‌ : లైగర్ బ్యూటీ చిల్‌ మూమెంట్‌

లైగర్‌ ఫ్లాప్‌ కావడంతో సౌత్‌ సినిమాలపై అనన్య ఆసక్తి చూపించడం లేదు. తండ్రి కారణంగా ఇండస్ట్రీలో ఈజీగానే ఎంట్రీ దక్కించుకున్న అనన్య పాండే సక్సెస్‌ కోసం ఎక్కువగానే కష్టపడుతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు.;

Update: 2025-03-11 08:01 GMT

'స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2' సినిమాతో బాలీవుడ్‌లో పరిచయం అయిన ముద్దుగుమ్మ అనన్య పాండే. బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య పాండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి పేరు సొంతం చేసుకున్న అనన్య పాండే ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. 2022లో విజయ్ దేవరకొండకు జోడీగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో 'లైగర్‌' సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. తనకు ఇష్టం లేకుండానే ఆ సినిమాలో నటించాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూల అనన్య పాండే చెప్పి అందరిని సర్‌ప్రైజ్ చేసింది.


లైగర్‌ ఫ్లాప్‌ కావడంతో సౌత్‌ సినిమాలపై అనన్య ఆసక్తి చూపించడం లేదు. తండ్రి కారణంగా ఇండస్ట్రీలో ఈజీగానే ఎంట్రీ దక్కించుకున్న అనన్య పాండే సక్సెస్‌ కోసం ఎక్కువగానే కష్టపడుతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. లైగర్ సినిమా తర్వాత కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అనన్య ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాల చొప్పున చేస్తూ వస్తున్న అనన్య పాండేకు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించేందుకు ఆఫర్లు దక్కాల్సి ఉంది. స్టార్‌ హీరోల సినిమాల్లో నటించినప్పుడే స్టార్‌ హీరోయిన్స్ సరసన నిలిచే అవకాశం ఉంటుంది.


హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్న అనన్య సోషల్‌ మీడియా ద్వారా అందమైన ఫోటోలను షేర్‌ చేయడం మాత్రం మానదు. దాదాపుగా 26 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న అనన్య పాండే రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు సన్నిహితులతో కలిసి ట్రిప్‌కు వెళ్లింది. అక్కడ తీసుకున్న ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో షేర్‌ చేస్తూ వచ్చింది. అక్కడి అందమైన లొకేషన్స్‌ను చూపించడంతో పాటు, తన అందమైన రూపాన్ని సైతం తన పోస్ట్‌ల ద్వారా చూపిస్తూ వచ్చింది. తాజాగా మరోసారి అనన్య పాండే తన ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అయింది.


స్వర్గంలో చివరి రోజు అంటూ క్యాప్షన్ ఇచ్చి తన అందమైన పిక్చర్స్‌ను అక్కడి లొకేషన్స్‌, ఫుడ్‌, జంతువులు, ప్రకృతిని చూపించింది. అన్ని ఫోటోలు చూపరులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అనన్య పాండే చాలా స్పెషల్‌ ఫోటోలను షేర్‌ చేసి కొత్త ప్రపంచాన్ని అందరికీ చూపించిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనన్య పాండే ప్రస్తుతం కేసరి చాప్టర్‌ 2 సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్‌లో త్వరలోనే ఈమె జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయిన బాలీవుడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. మరో వైపు రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అవి ఈ సమ్మర్‌లోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా అనన్య పాండే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. మధ్యలో ఇలా చిల్‌ అవుతూ ఆ చిల్లింగ్‌ మూమెంట్స్‌ను సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.

Tags:    

Similar News