సమంత - రాజ్.. మళ్ళీ వైరల్!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సమంత బాలీవుడ్ లో కూడా మొన్నటివరకు చాలా బిజిగానే కనిపించింది.;

Update: 2025-03-11 07:53 GMT

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సమంత బాలీవుడ్ లో కూడా మొన్నటివరకు చాలా బిజిగానే కనిపించింది. ఆమె నటించిన సినిమాలు ఒక భాషకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ ఇండస్ట్రీలలో విడుదల అవుతుండడంతో సామ్ పేరు గట్టిగానే ట్రెండ్ అవుతోంది. కెరీర్ పరంగా వెబ్ సిరీస్, బాలీవుడ్ ప్రాజెక్టులతో ముందుకెళ్లిన ఆమె ఇప్పుడు తెలుగు సినిమాకు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఆమె ప్రైవేట్ లైఫ్‌కి సంబంధించిన రూమర్స్ కూడా అదే స్థాయిలో హైలైట్ అవుతున్నాయి. తాజాగా దర్శకుడు రాజ్ నిదిమోరుతో కలిసి ఆమె కనిపించడం, మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సమయంలో రాజ్ నిదిమోరుతో సమంతకు పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. గతంలో పికిల్ బాల్ ఆడుతూ వీరిద్దరూ కనిపించడంతో అప్పట్లోనే ఈ గాసిప్స్ మొదలయ్యాయి.

ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి కనిపించడంతో పుకార్లు ఊపందుకున్నాయి. తాజాగా ఓ ఫ్రెండ్లీ అవుటింగ్‌లో సమంత, రాజ్ నిదిమోరు కలిసి కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంత గ్రీన్ కలర్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌తో మెరిసిపోగా, రాజ్ నిదిమోరు కాజువల్ టీషర్ట్, జీన్స్‌లో కనిపించాడు. ఇద్దరూ తమ స్నేహితులతో సరదాగా గడిపిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో కూడా ఇదే విధంగా వీరిద్దరూ టాప్ ట్రెండింగ్‌లోకి రావడంతో ఇప్పుడు మళ్లీ అదే పునరావృతం కావడం ఆసక్తికరంగా మారింది. సమంత గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ట్రెండ్ అవుతుండటంతో ఈ రూమర్లు మరింత ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం సమంత, నందిని రెడ్డి డైరెక్షన్‌లో ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఆమె రాజ్ నిదిమోరుతో మరో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నట్లు టాక్ ఉంది.

దీంతో సినిమాకు సంబంధించి వీరిద్దరూ కలిసి కనిపించి ఉండొచ్చనే కోణంలో కూడా కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. అయితే వీరి మధ్య కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ మాత్రమే ఉందా లేక మరేదైనా ఉందా? అనే దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటివరకు సమంత కానీ, రాజ్ నిదిమోరు కానీ ఈ రూమర్లపై స్పందించలేదు. వారి మౌనం మరింత అనుమానాలకు తావిస్తోంది. నిజంగానే వీరిద్దరి మధ్య ఏదైనా ఉన్నట్టేనా? లేక స్నేహితుల మధ్య సహజంగా ఉండే క్లోజ్ నెస్‌నే మరోలా అనుకుంటున్నారా అన్నది కేవలం టైమ్ మాత్రమే తేల్చాలి. ప్రస్తుతం సమంత సినీ కెరీర్‌కు సంబంధించి కీలకమైన దశలో ఉంది. ఆమె టాలీవుడ్‌లో తిరిగి రీ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News