బాహుబలి ఢీ అంటే ఢీ అంటూ వచ్చేస్తున్నాడు. ఇదే నా తొలి యుద్ధం. ది బిగినింగ్ అంటూ వచ్చేస్తున్నాడు. ప్రభాస్, రానా, రాజమౌళి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ .. ఇంతమందిపై ప్రపంచం కళ్లున్నాయి. వీళ్లంతా ఒకరిని మించి ఒకరు నటించి ఉంటారని, భారతదేశ చరిత్రలో నిలిచిపోయే చిత్రంలో భాగస్వాములైన అందరి కెరీర్‌ని తిప్పేసే చిత్రమిదని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారం ఇక్కడితో ఆగిపోలేదు. బాహుబలి ప్రచారానికి అదనంగా ఇద్దరు మెగాస్టార్‌లు యాడై పీక్స్‌కి తీసుకెళుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ట్రైలర్‌లు, పాటలు చూసి అద్భుతం అని పొగిడేశారు. బాహుబలి భారతదేశంలోనే అత్యుత్తమ సినిమా అవుతుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు. రాజమౌళి, ప్రభాస్ అండ్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అదే తీరుగా ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'బాహుబలి'ని విపరీతంగా పొగిడేస్తున్నారు. బిగ్‌బి ఈ చిత్రం గురించి పొగిడేస్తూ.. అద్భుతం, అసాధారణం అని కితాబిచ్చారు. ఇలాంటి విజువల్స్ ఇంతవరకూ చూడనేలేదన్నారు. ఇంక్రెడిబుల్, ఫాంటాస్టిక్ మూవీ అంటూ మసాలా దట్టించిన పదాలతో బాహుబలిని పొగిడేశాడు బాలీవుడ్ మెగాస్టార్. మహిష్మతి సామ్రాజ్యాన్ని భారతదేశ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలన్న ఉత్సాహం పొంగి పొర్లుతోందని ప్రశంసించారు.
చిరంజీవి, అమితాబ్ ప్రశంసతో బాహుబలి ప్రచారం పీక్స్‌కు చేరినట్టే. స్వయంగా ఈ విషయాన్ని ప్రభాసే చెప్పాడు. ఇద్దరు మెగాస్టార్‌లు ఈ రేంజులో పొగిడేయడంతో బాహుబలి టీమ్‌కు చాలా హ్యాపీగా అనిపించిందట. ఆ రేంజు పెద్ద మనుషులు పొగడుతుంటే మాకు కొండంత ధైర్యంగా ఉంది.. ఈ ఎంకరేజ్‌మెంట్‌తో కాస్త టెన్షన్ నుండి భయటపడ్డాం అంటున్నాడు ప్రభాస్.