రామ్ గోపాల్ వర్మ చాన్నాళ్ల తర్వాత ఒక బడా హీరోతో సినిమా చేయబోతున్నాడు. ఆ మీరో మరెవరో కాదు.. మెగా స్టార్ అమితాబ్ బచ్చన్. వీళ్లిద్దరి కాంబినేషన్లో సర్కార్ సిరీస్ లో కొత్త సినిమా వస్తుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి వర్మ ఎప్పుడో చెప్పాడు కానీ.. అమితాబ్ నుంచే కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇప్పుడది వచ్చేసింది. తాను ‘సర్కార్-3’లో నటిస్తున్న విషయం వాస్తవమే అని.. అది ఇంకో రెండు రోజుల్లో మొదలవుతుందని అమితాబ్ ప్రకటించాడు. అమితాబ్ చెప్పిన ‘సర్కార్-3’ సంగతులు ఆయన మాటల్లోనే..
‘‘ఇంకో రెండో రోజుల్లోనే సర్కార్-3 సినిమా షూటింగ్ మొదలవుతుంది. ‘సర్కార్’లో ఉన్న కొన్ని పాత్రలు ఇందులో మారుతాయి. అలాగే సర్కార్.. సర్కార్ రాజ్ సినిమాల్లో చనిపోయిన పాత్రలు ఇందులో మళ్లీ కనిపించవు. సర్కార్-3 లో కొత్త కథ ఉంటుంది. కానీ సర్కార్ మాత్రం అలాగే ఉంటాడు. ఇందులో కొత్త ఆర్టిస్టులు కూడా కనిపిస్తారు. సినిమా విడుదలకు సిద్ధమైన తర్వాత కథ గురించి మరిన్ని వివరాలు చెబుతాం’’ అని అమితాబ్ వెల్లడించాడు.
బాల్ థాకరే స్ఫూర్తితో సర్కార్ పాత్రను సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ. 2005లో వచ్చిన ‘సర్కార్’ సంచలన విజయం సాధించింది. బాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘సర్కార్ రాజ్’ కూడా ఆకట్టుకుంది. ‘సర్కార్ రాజ్’ వచ్చిన తొమ్మిదేళ్లకు ఇప్పుడు ఈ సిరీస్ లో కొత్త సినిమా రాబోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/