#KBC 13.. క‌రోనాకే స‌వాల్ విసురుతున్న 78ఏళ్ల ఏకైక లెజెండ్

Update: 2021-05-06 08:30 GMT
#KBC 13.. క‌రోనాకే స‌వాల్ విసురుతున్న 78ఏళ్ల ఏకైక లెజెండ్
  • whatsapp icon
ఓవైపు సెకండ్ వేవ్ క‌ల్లోలం కొన‌సాగుతోంది. ఈ దెబ్బ‌కు బాలీవుడ్ బంద్ అయ్యింది. షూటింగుల్లేవ్.. రిలీజుల్లేవ్.. ఎవ‌రూ ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. కానీ వీళ్లంద‌రికీ అతీతంగా 78 సంవ‌త్స‌రాల వ‌యసులో ది గ్రేట్ అమితాబ్ బ‌చ్చ‌న్ సాహ‌సాలు చూస్తుంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఆయ‌న ప్ర‌ళ‌య‌వికార‌ కోవిడ్ కే స‌వాల్ విసురుతున్నారు. నువ్వు ఉన్నా నేను ఝ‌డిసేది లేదు! అని ఛాలెంజ్ చేస్తున్నారు. దేనినైనా ఎదుర్కొనేందుకు స‌వాల్ విసురుతున్న తీరు ఎంద‌రికో స్ఫూర్తి నింపుతోంది.

ఏజ్ లెస్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ `కౌన్ బనేగా క‌రోర్ ప‌తి` సీజన్ 13 తో తిరిగి బ‌రిలోకి వ‌స్తున్నారు. గ‌త సీజన్ ఆడిష‌న్స్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఆయ‌న‌కు కోవిడ్ సోకిన సంగ‌తి తెలిసిందే. 77ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న మొక్క‌వోని ధీక్ష‌తో అభిమానుల ప్రార్థ‌న‌ల‌తో అత్యంత వేగంగా కోవిడ్ నుంచి కోలుకుని అంద‌రిలోనూ స్ఫూర్తి నింపారు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ధైర్యాన్ని నింపారు.

ఆయ‌న‌లో స్ఫూర్తి నిచ్చే గుణం ఎక్క‌డా త‌గ్గిన‌ట్టు లేదు. ఇప్పుడు కూడా మ‌రోసారి అదే సాహ‌సం. కోవిడ్ సెకండ్ వేవ్ విల‌యం కొన‌సాగుతున్నా ఆయ‌న దేనికీ ఝ‌డ‌వ‌డం లేదు. ఒక‌సారి ఎదుర్కొన్న‌ త‌న‌కు ఏమీ కాద‌న్న మొండి ధైర్యం క‌నిపిస్తోంది. సూక్ష్మ‌జీవులు వైర‌స్ లు త‌న‌ వృత్తికి ఆటంకం కాజాల‌వు అని నిరూపిస్తున్నారు.

కౌన్ బనేగా క‌రోర్ ప‌తి స‌క్సెస్ వెనుక ఉన్న ప్రధాన కారణాలలో గ్రేట్ హోస్ట్  లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ .. COVID-19 మొద‌టి వేవ్ ఉన్న‌ప్పుడు కూడా 12 వ సీజన్ షూట్ లో పాల్గొన్న అమితాబ్ అంత‌కుముందు అనేక సీజన్లకు హోస్ట్ గా కొన‌సాగారు. ఇప్పుడు అన్ని ప్రోటోకాల్ లకు కట్టుబడి ప‌ని చేస్తారు. గ‌త సీజ‌న్ లో కోవిడ్ -19 పాజిటివ్ పరీక్షించినప్పటికీ అమితాబ్ బచ్చన్ కోలుకున్న వెంటనే తిరిగి సెట్స్ లోకి వచ్చారు. ఇప్పుడు 13 వ సీజన్ తో ఛాలెంజ్ కి సిద్ధంగా ఉన్నారు.

సోనీ టీవీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ హోస్ట్ గురించి ఒక వీడియోను పోస్ట్ చేసింది. త‌న‌ సార‌థ్యంలోనే ఈసారి కూడా ప్రదర్శన కోసం రిజిస్ట్రేషన్లు మే 10 న ప్రారంభమవుతాయని ప్రకటించారు. బిగ్ బి ఎప్పటిలాగే మూడు ముక్కల సూట్ లో కనిపిస్తారు. రీక‌న్ స్ట్ర‌క్ట్ చేసిన‌ సెట్ చాలా అందంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News