మలయాళ హీరోయిన్ భావనను లైంగికంగా వేదించిన కేసులో నటుడు దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేసి - రిమాండ్ కు కూడా తరలించిన విషయం తెల్సిందే. చాలా రోజుల పాటు ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న దిలీప్ ను మళ్లీ సినిమా పరిశ్రమలోకి తీసుకు వచ్చేందుకు మోహన్ లాల్ ప్రయత్నించాడట. అసోషియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టు(అమ్మ) అధ్యక్షుడు అయిన మోహన్ లాల్ ఆరోపణలు ఎదుర్కొన్న దిలీప్ ను బహిష్కరించడం కాని - ఆయనతో రాజీనామా చేయించడం కాని చేయలేదు. పైగా ఆయన అమ్మలో కొనసాగేలా ప్రయత్నాలు చేశాడంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.
మోహన్ లాల్ తీరుకు నిరసనగా పలువురు సభ్యులు అమ్మ నుండి వైదొలగడంతో పాటు - తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయినా కూడా వారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు తప్ప దిలీప్ ను తప్పించే ప్రయత్నం చేయలేదనే టాక్ ఉంది. సినిమా పరిశ్రమ నుండి మరింతగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో దిలీప్ ను రాజీనామా చేయించాడు. అయితే దిలీప్ రాజీనామా చేసిన పది రోజులైనా కూడా ఆమోదించకుండా మరోసారి దొంగ చాటుగా రాజీకి ప్రయత్నించాడనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
దిలీప్ విషయంలో అమ్మ సభ్యులు రాజీకి రాకపోవడంతో తాజాగా ఆయన రాజీనామాను ఆమోదించి - ఆయన్ను అమ్మ నుండి బహిష్కరిస్తున్నట్లుగా మోహన్ లాల్ ప్రకటించాడు. పైగా అమ్మ నుండి ఆయన్ను తానే బహిష్కరించాను - అతడి రాజీనామాను వెంటనే ఆమోదించాను - అయినా కూడా కొందరు నన్ను టార్గెట్ చేసి విమర్శలు చేయడం బాధాకరంగా ఉందని మోహన్ లాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దిలీప్ పై వేటు పడినా కూడా మోహన్ లాల్ విషయంలో మాత్రం అమ్మలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. ప్రస్తుతానికి అది బయటకు రాకున్నా - సమయం వచ్చినప్పుడు మోహన్ లాల్ పై అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు అంతా రెడీగా ఉన్నారు.