చిత్రం : ‘అమ్మమ్మగారిల్లు’
నటీనటులు: నాగశౌర్య - షామిలి - సుమిత్ర - రావు రమేష్ - సుమన్ - సుధ - శివాజీ రాజా - హేమ - పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: కళ్యాణ రమణ
నేపథ్య సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్
నిర్మాత: రాజేశ్
రచన - దర్శకత్వం: సుందర్ సూర్య
తెలుగులో గత కొన్నేళ్లుగా మళ్లీ పల్లెటూరి కథలకు పట్టం కడుతున్నారు ప్రేక్షకులు. యువ కథానాయకుడు నాగశౌర్య కూడా ఇప్పుడు అదే బాట పట్టాడు. కొత్త దర్శకుడు సుందర్ సూర్యతో ‘అమ్మమ్మగారిల్లు’ సినిమా చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
సంతోష్ (నాగశౌర్య) ఎంబీఏ చదువుతున్న కుర్రాడు. అతడికి తన అమ్మమ్మ (సుమిత్ర) అంటే చాలా ఇష్టం. కానీ గతంలో జరిగిన గొడవల వల్ల సంతోష్ కుటుంబం అతడి అమ్మమ్మ ఊరికి వెళ్లకుండా ఉండిపోతుంది. సంతోష్ అత్తయ్య.. మావయ్యల కుటుంబాలదీ అదే పరిస్థితి. వీళ్లందరికీ దూరంగా పల్లెటూరిలో ఒంటరి జీవనం సాగిస్తున్న సంతోష్ అమ్మమ్మ చాలా బాధపడుతుంటుంది. ఐతే ఆస్తిని అందరికీ పంచి ఇవ్వడానినిక ఆమె అందరినీ పల్లెటూరికి రమ్మంటుంది. అలా అయినా కొన్ని రోజులు అందరితో సంతోషంగా ఉండాలనుకుంటుంది. కానీ వచ్చిన వాళ్లందరి దృష్టి ఆస్తి పంపకాల మీదే ఉంటుంది. ఇది చూసి బాధపడుతున్న తన అమ్మమ్మను సంతోషంగా ఉంచడానికి సంతోష్ ఏం చేశాడు? ఆ కుటుంబంలోని మనుషుల్లో ఎలా మార్పు తెచ్చాడు.. చివరికి ఏమైంది.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
కాలానుగుణంగా వస్తున్న మార్పులతో మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోయి.. మానవ సంబంధాలు బాగా దెబ్బ తింటున్న వైనంపై సినిమాలు తీయడం గత కొన్నేళ్లలో బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో నడిచే సినిమాల్లో కొన్ని మంచి విజయం సాధించాయి కూడా. ఇలాంటి కథలకు పల్లెటూరి నేపథ్యాన్ని ఎంచుకోవడం ద్వారా ఒక అందం తీసుకొస్తున్నారు దర్శకులు. ప్రేక్షకులు కూడా తమ జీవితాల్నే ఇందులో చూసుకుంటూ ఆస్వాదిస్తున్నారు. ఆ కోవలో గత ఏడాది పెద్ద విజయం సాధించిన సినిమా ‘శతమానం భవతి’. ఆ సినిమాకు జనాలు విపరీతంగా కనెక్టయిపోయి ఎగబడి చూశారు. దీనికి ముందు.. తర్వాత కూడా ఇలాంటి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ అన్ని సినిమాలకూ అలాంటి మ్యాజిక్ జరగలేదు. ఇప్పుడు ఈ కోవలోనే వచ్చిన కొత్త సినిమా ‘అమ్మమ్మగారిల్లు’. దాదాపుగా ‘శతమానం భవతి’ ఫార్మాట్లోనే సాగిపోయే ఈ సినిమా దాని లాగా ప్రేక్షకుల్లో ఫీల్ తేలేకపోయింది. వినోదంలో ముంచెత్తలేకపోయింది.
‘అమ్మమ్మగారిల్లు’లో కొన్ని మంచి మూమెంట్స్ అయితే ఉన్నాయి. కానీ వాటిని మించి ప్రేక్షకుల్ని విసుగెత్తించే అంశాలున్నాయి. ముందుగా ఈ కథ అసలేమాత్రం కొత్తది కాదు. దాన్ని చెప్పిన విధానంలోనూ కొత్తదనం లేదు. సాగతీత.. మెలోడ్రామా ఎక్కువైపోయి.. సమయం ముందుకు కదలడమే కష్టమవుతుంది. బంధాలు.. ఆప్యాయతలు మరిచిపోయిన మనుషులంతా ఆస్తి పంపకాల కోసం ఒకచోటికి చేరడం.. ఒకరితో ఒకరు ఎడమొహం పెడమొహంగా ఉండటంతో ఈ కథ ఎలా సాగబోయేది ముందే ఒక అంచనాకు వచ్చేస్తుంది. హీరో ఒక్కొక్కరిగా వీళ్లను మార్చడమే పనిగా పెట్టుకుంటాడని.. వాళ్లు మారిపోయి మానవీయ సంబంధాల విలువ తెలుసుకుని ఒక్కటైపోవడమే ఈ కథ అని ముందే ఒక అంచనాకు వచ్చేస్తాం.
ఇలాంటి సమయంలో మధ్యలో డ్రామాను రక్తికట్టించడానికి బలమైన సన్నివేశాలు పడాలి. ఏవైనా మలుపులుండాలి. అలాగే కథను నడిపించే క్యారెక్టర్లలో ఏదైనా ప్రత్యేకత కనిపించాలి. కానీ ‘అమ్మమ్మగారిల్లు’లో ఇవన్నీ మిస్సయ్యాయి. వచ్చిన మరుసటి రోజుకే అందరూ పని ముగించుకుని వెళ్లిపోవాల్సిన స్థితిలో వాళ్లకు ఎదురయ్యే అడ్డంకి చాలా సిల్లీగా అనిపిస్తుంది. సింపుల్ గా తేలిపోయే సమస్యను ఊరికే కథ ముందుకు సాగడం కోసమే పరిష్కరించకుండా అట్టిపెట్టేసిన భావన కలిగిస్తుంది. ఇక హీరో ఒక్కొక్కరిని మార్చడానికి వేసే ప్లాన్లు.. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఏమంత సహజంగా లేవు. కృత్రిమత్వం.. నాటకీయతో ముడిపడ్డ సన్నివేశాలు ఫీల్ తీసుకురావు. కథకు కీలకమైన అమ్మమ్మ పాత్రను సెంటిమెంటు పిండటానికి తప్ప మరి దేనికీ ఉపయోగించలేదు. ఆ పాత్రను ప్యాసివ్ గా.. బలహీనంగా మార్చేశారు. హీరో హీరోయిన్ల ప్రేమకథ కూడా పేలవంగా తయారైంది.
ఏ సినిమాలో అయినా ప్రథమార్ధంలో పాత్రల పరిచయం అదీ ఇదీ ఉంటుంది కాబట్టి కథనం కొంచెం వేగంగానే సాగిపోయి.. మధ్యలో కథ మీద ఫోకస్ చేశాక కథనం నెమ్మదిస్తుంది. కానీ ‘అమ్మమ్మగారిల్లు’లో కథనం మొదట్నుంచే నెమ్మదిగా సాగుతుంది. విరామ సమయానికి వచ్చేసరికే ప్రేక్షకుల సహనానికి పరీక్ష మొదలవుతుంది. ఐతే ద్వితీయార్ధం పరిస్థితి కొంచెం మెరుగువుతంది. కుటుంబ సభ్యుల్లో మార్పు వచ్చాక వాళ్లు స్పందించే తీరు.. వాళ్ల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు బాగా పండాయి. ఈ సన్నివేశాల్లో ఎమోషన్ వర్కవుటైంది. ఒక ఎపిసోడ్ కళ్లను తడి చేస్తుంది. కానీ తర్వాత మళ్లీ మామూలే. చాలా మామూలుగా సినిమాను ముగించారు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘అమ్మమ్మగారిల్లు’ మంచి ఉద్దేశాలతో తీసిన సినిమానే. కానీ ఆసక్తికరంగా చెప్పలేకపోయారు. కొన్ని మంచి సీన్లు పడ్డప్పటికీ కొత్తదనం లేకపోవడం.. మెలోడ్రామా ఎక్కువైపోవడంతో చాలా వరకు ఇది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.
నటీనటులు:
సంతోష్ పాత్రలో నాగశౌర్య చక్కగా నటించాడు. ఆ పాత్రకు అతను కరెక్టుగా సూటయ్యాడు. అదేమీ సవాలు విసిరే పాత్రేమీ కాదు. దానికి తగ్గట్లుగా కొలిచినట్లు నటించాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హీరోయిన్ షామిలి జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆమెలో హీరోయిన్ లక్షణాలేమీ కనిపించవు. నటన కూడా మామూలే. ఆమె ముఖం చూస్తే.. చాలా సినిమాలు చేసి అలసిపోయిన హీరోయిన్ లాగా కనిపిస్తుంది. ‘శతమానం భవతి’లో అనుపమ లాంటి హీరోయిన్ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. ఇక సినిమా మొత్తంలో నటన పరంగా పైన నిలిచేది రావు రమేషే. ఆయన తనదైన ఎటకారం చూపించడానికి అవకాశమిచ్చింది ఇందులోని పాత్ర. కొన్ని చోట్ల ఆయనకు అలవాటైన ఓవర్ ద బోర్డ్ యాక్టింగ్ కనిపించినప్పటికీ.. ఓవరాల్ గా ఆయన మెప్పించారు. అమ్మమ్మగా సుమిత్ర బాగానే చేశారు. కాకపోతే ఆమె వైవిధ్యం చూపించడానికి అవకాశం లేకుండా పూర్తిగా ఏడుపుతో ముడిపడ్డ పాత్రకు పరిమితం చేసేశారు. ఇక హేమ.. శివాజీ రాజా.. రవిప్రకాష్.. వీళ్లంతా బాగానే చేశారు. షకలక శంకర్ తన కామెడీతో అక్కడక్కడా బాగానే నవ్వించాడు. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతివర్గం:
కళ్యాణ రమణ పాటలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. బాలు పాడిన టైటిల్ సాంగ్ ఒక్కటి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. ఈ ట్రెండుకు తగ్గ పాటలు ఇవ్వలేదు రమణ. సాయికార్తీక్ నేపథ్య సంగీతం అసలే డ్రామా ఎక్కువన్న సినిమాను మరింత నాటకీయంగా మార్చింది చాలాచోట్ల. అతను ఒకప్పుడు ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతం అందించడంలో పెట్టింది పేరైన ఎస్.ఎ.రాజ్ కుమార్ ను ఫాలో అయినట్లు కనిపిస్తుంది. రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణంలో మెరుపులేమీ లేవు. సినిమాటోగ్రఫీ సాధారణంగా అనిపిస్తుంది. పల్లెటూరి నేపథ్యం ఉన్న సినిమాకు కెమెరాతో చేకూరాల్సిన అందం రాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ సుందర్ సూర్యకు ఏదో మంచి చెప్పాలన్న తపన ఉంది కానీ.. కథలో కొత్తదనం చూపించలేకపోయాడు. కథనాన్ని కూడా ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగ్గ వేగంతో చెప్పలేకపోయాడు.
చివరగా: అమ్మమ్మగారిల్లు.. ‘మంచి’ సినిమానే కానీ..
రేటింగ్- 2/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre