ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న సినిమాలు హిట్టు ఫట్టు గురించి క్లారిటీగా చెప్పలేకపోతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే కొన్ని సినిమాలు విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తాయి. మరికొన్ని సినిమాలు విడుదలయ్యాక మంచి క్రేజ్ సంపాదించుకుంటాయి. అలాంటి సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి. భారీ అంచనాలతో థియేటర్లో ఫెయిల్ అయిపోయిన సినిమాలు.. తీరా ఎలాంటి అంచనాలు లేకుండా టీవీ ఛానల్లో రిలీజ్ చేస్తే అద్భుతమైన టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఓటిటి సినిమా విషయంలో అదే జరిగింది. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన డివోషనల్ సినిమా 'అమ్మోరు తల్లి'.
ఈ సినిమా లాక్డౌన్ సమయంలో థియేటర్స్ ఓపెన్ అయ్యేలా లేవని నవంబర్ నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిజిటల్ రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాకు ఓటిటిలో చుక్కెదురు అయిందని చెప్పాలి. కథాకథనాలు చాలా బలహీనంగా ఉండటం.. పాత సినిమాలలో సన్నివేశాలే తిరిగి చూపించే ప్రయత్నం చేశారు. కానీ స్టోరీ లైన్ ఒక్కటే మార్చారు. అక్రమంగా దేవాలయాల భూములు స్వాధీనం చేసుకుంటున్న దొంగబాబాను మట్టుపెట్టడానికి స్వయంగా అమ్మోరు తల్లి భూమిపైకి రావడం అనేది కాన్సెప్ట్. కానీ జనాలకు పెద్దగా ఎక్కలేదు. కానీ అసలు చూస్తారో లేదో అనుకుంటూ స్టార్ మా ఛానల్ ఈ సినిమా సాటిలైట్ హక్కులను దక్కించుకుంది. ఇటీవలే ప్రసారం కూడా చేయడంతో సైరా, సాహో సినిమాలను మించిన టిఆర్పి 6.60 రేటింగ్ రావడం విశేషం. దీన్ని మంచి విజయంగా స్టార్ మా వారు భావిస్తున్నారట. అయితే గతంలో అతడు, ఖలేజా సినిమాల విషయంలో ఇదే జరిగింది.