సూర్య రెట్రో టీజర్.. శాంపిలే చితక్కొట్టేశారు..!

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-12-25 07:19 GMT

కంగువ తర్వాత సూర్య చేస్తున్న 44వ సినిమా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నటించడమే కాదు సూర్య స్వయంగా తన 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. క్రిస్ మస్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ తో పాటు సినిమా టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. రెట్రో టైటిల్ తో సూర్య వింటేజ్ లుక్ అదిరిపోయింది. అంతేకాదు టీజర్ లో నీ ప్రేమ కోసం నేను ఇప్పటి నుంచి అన్నీ వదిలేస్తున్నా అంటూ చెప్పిన డైలాగ్ కెవ్వు కేక అనిపించింది.

జస్ట్ టీజర్ లో చూపించింది శాంపిలే అయినా కార్తిక్ సుబ్బరాజు స్టోరీ డెప్త్.. ఇంటెన్స్ ఏంటన్నది తెలిసిపోతున్నాయి. ముఖ్యంగా సూర్య నుంచి ఫ్యాన్స్ కోరుతున్న ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ గా రెట్రో వస్తుంది. కంగువ మీద ఎన్నో ఆశలు పెట్టుకోగా అది నిరాశ పరిచింది. అందుకే సూర్య రెట్రోతో తన మాస్ ఎలివేషన్ చూపించనున్నాడు. టీజర్ లో స్టార్ గా సూర్య, డైరెక్టర్ గా కార్తీక్ ఇద్దరు తమ స్ట్రాంగ్ నెస్ ఏంటన్నది చూపించే ప్రయత్నం చేశారు.

ఇక చాలా రోజుల తర్వాత పూజా హెగ్దే తన రెగ్యులర్ గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో కాస్త న్యాచురల్ లుక్స్ తో కనిపిస్తుంది. సూర్య, పూజా హెగ్దే లవ్ స్టోరీ విత్ వైలెన్స్ గా రెట్రో రాబోతుంది. ఈ సినిమా టీజర్ తోనే సినిమా ఏంటన్నది శాంపిల్ చూపించారు. కచ్చితంగా వర్త్ ఫుల్ మూవీగా ఈ క్రేజీ కాంబో సినిమా వస్తుందని చెప్పొచ్చు.

కొన్నాళ్లుగా తన ఇమేజ్ కి దూరంగా కూల్ సినిమాలు చేస్తూ వస్తున్న సూర్య ఒక్కసారి తన వింటేజ్ మాస్ అప్పీల్ తో రెట్రోగా రాబోతున్నాడు. టీజర్ లో ప్రతి అంశం పర్ఫెక్ట్ అనిపించేలా ఉంది. మరి కార్తీక్ పై సూర్య పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారా లేదా అన్నది చూడాలి. సూర్య రెట్రో పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 2025 సమ్మర్ రిలీజ్ ప్లానింగ్ లో ఉన్న ఈ సినిమా టీజర్ తో సూర్య ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. సూర్య ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా కార్తీక్ సుబ్బరాజ్ మాస్ విధ్వంసంగా రెట్రోల్ వస్తుంది. మరి ఈ సినిమా టీజర్ అదరగొట్టగా సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే మాత్రం సూర్య ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.


Full View
Tags:    

Similar News