కేన్స్ రెడ్ కార్పెట్ పై రజినీ హీరోయిన్

Update: 2016-05-06 15:30 GMT
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడం, అక్కడి రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం దక్కించుకోవడం అంత సులభం కాదు. ఇండియా నుంచి ఇప్పటివరకూ ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్, సోనమ్ కపూర్, మల్లికా షెరావత్ వంటి కొందరికి మాత్రమే ఈ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడీ అరుదైన అవకాశాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన రోబో 2.0లో హీరోయిన్ గా నటిస్తున్న అమీ జాక్సన్ దక్కించుకుంది.

బ్రిటిష్ మోడల్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన అమీ జాక్సన్.. ఈ ఏడాది కేన్స్ లో రెడ్ కార్పెట్ పై నడవనుంది. 'కేన్స్ లో భాగమయ్యే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. రెడ్ కార్పెట్ పై నడిచే క్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే డ్రస్సుల ఎంపిక నుంచి అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకుంటున్నా' అని చెప్పింది అమీ జాక్సన్. అయితే.. అమీకి ఈ ఫెస్టివల్ లో పాల్గొనే అవకాశం వచ్చినది మాత్రం ఇండియా తరఫున కాకపోవడమే బాధాకరం. బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్ తరఫున కేన్స్ కు హాజరవుతోంది అమీ జాక్సన్.

తన కెరీర్ ని ఇండియాలోనే టాప్ రేంజ్ కి చేర్చుకున్నఈ అందగత్తె.. ఇప్పుడు భారత్ ను రిప్రజెంట్ చేయడం లేదు. అయితే.. ఈ అవకాశం అందరికీ దక్కేది కాకపోవడంతో.. ఈవిషయంలో రాజీపడక తప్పదని చెప్పాల్సిందే. ఈ కార్యక్రమంతో పాటు సిరియా శరణార్ధుల కోసం ఏర్పాటు చేస్తున్న కొన్ని ఛారిటీ కార్యక్రమాల్లోనూ సందడి చేయనుంది అమీ జాక్సన్.



Tags:    

Similar News