బెంగాల్ టైగర్ తో బ్రిటిష్ బ్యూటీ?

Update: 2015-12-21 06:48 GMT
మాస్ మహరాజా రవితేజ బెంగాల్ టైగర్ సక్సెస్ తో జోష్ లోకి వచ్చేశాడు. కిక్2 ఇచ్చిన నిరుత్సాహం నుంచి.. బెంగాల్ టైగర్ రవితేజను బయటకు తెచ్చేసింది. మాస్ లో తన పవర్ ఏంటో.. పక్కా నాన్ వెజ్ మూవీతో చూపించిన రవితేజ.. ఇప్పుడు నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. నిజానికి రవితేజ తర్వాతి మూవీ ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేసి ఉండాలి.

దిల్ రాజు బ్యానర్ లో ఎవరో ఒకడుని లాంఛనంగా స్టార్ట్ చేసినా.. ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ఫిబ్రవరి వరకూ ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశాడు మాస్ మహరాజ్. ఇప్పుడు మరో వెంచర్ పై కన్నేశాడు. కెఎల్ దామోదర్ నిర్మాణంలో.. కొత్త డైరెక్టర్ చక్రి ఓ మూవీ తీయబోతున్నాడు. ఈ సినిమా కోసం.. రవితేజ సరసన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ ని నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అమ్మడి దగ్గరకు ప్రపోజల్ వెళ్లింది కూడా. రవితేజ్ - అమీల పెయిర్ సూపర్బ్ ఉంటుందని నిర్మాతలు అంటున్నారు. అయితే.. ఇంకా ఆ భామ దగ్గర నుంచి క్లియరెన్స్ రాలేదు. తన కేరక్టర్ గురించి గట్టిగానే ఆరా తీసిందట అమీ జాక్సన్.

తన నిర్ణయం రెండు వారాల్లో చెబుతానని అనిందట. న్యూ ఇయర్ నాటికి తమ ప్రాజెక్ట్ కాస్టింగ్ డీటైల్స్ ఫైనల్ అవుతాయని నిర్మాతలు అంటున్నారు. ఈ భామ తెలుగు ప్రజలకు పరిచితమే అయినా.. చివరగా చేసిన డైరెక్ట్ తెలుగు మాత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన ఎవడు. ఆ తర్వాత టాలీవుడ్ సినిమాల నుంచి భారీ ఆఫర్స్ ఏమీ రాలేదు. ఇప్పుడీ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తే.. టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త కాంబినేషన్ చూసే ఛాన్స్ దక్కినట్లే. ప్రస్తుతం ఈ బ్రిటిష్ పాప రజినీకాంత్ సరసన రోబో 2.0 లో చేస్తుండడం విశేషం.
Tags:    

Similar News