'రక్తసిక్తమైన' అనే హెడ్డింగ్ వినడానికే అంత ఇబ్బందిగా ఉంటే.. మరి ఈ ఇమేజ్ చూడ్డానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో చూస్కోండి. కాని ఇప్పుడు బ్రిటీష్ బ్యూటి ఆమీ జాక్సన్ మాత్రం.. ఇలా రక్తసిక్తంగానే ప్రమోట్ చేస్తాను మీరు దయచేసి మానేయండి అంటూ రచ్చ చేస్తోంది. పదండి ఈవిడ ఆవేదన ఏంటో చూద్దాం.
జల్లికట్టుకు ఓపెన్ గా సపోర్టు ఇచ్చిన భామలందరూ ఒకప్పుడు మూగ జీవాల కోసం అంటూ 'పెటా' సంస్థ తరుపున బాగానే ప్రచారం చేసినవారే. హీరోయిన్ త్రిష.. సింగర్ చిన్మయి మొదలగు అమ్మడులు.. మా సంస్కృతి అంటూ జల్లికట్టు కావాలని ఉద్యమం చేసేమునుపు.. మూగజీవాలను రకరకాలు ఇబ్బందులకు గురి చేయకండి.. వాటికి కూడా ప్రాణం ఉందని తెలుసుకోండి అంటూ పెటా షూట్లు చేశారు. ఇప్పుడు అదే తరహాలో ఆమీ జాక్సన్ కూడా.. మాంసాన్ని ఇలా వేలాడుతీస్తారు.. దయచేసి మీరు మాంసం తినడం మానేయండి.. వెజిటేరియన్ మాత్రమే తినండి అంటూ సెలవిస్తూ ఫోటో షూట్ చేసింది.
విషయం ఏంటంటే.. ఇదే ఆమీ జాక్సన్ చాలాసార్లు తాను లండన్ సబర్బన్ లో కత్తిలాంటి లంచ్ తింటున్నట్లు ఎన్నోసార్లు ఫోటోలు షేర్ చేసింది. వాటిలో మాంసం తాలూకు ప్రస్తావన కూడా అనేకసార్లు ఉంది. మరి ఏ రక్తసిక్తమైన మాంసం గురించి ఆమీ ఇలా ప్రచారం చేస్తున్నట్లు?? ఈ భామలందరూ అట పెటాను ఇటు జనాలను కూడా పిచ్చోళ్లను చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/