మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా సెలబ్రెటీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఒకరు ఇద్దరు లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇతరులు కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఎంతో మంది హీరోయిన్స్ లైంగిక ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా లైంగిక ఆరోపణలు చేసింది. తెలుగులో ‘మనసుకు నచ్చింది’ - ‘రాజుగాడు’ చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకు పోతుంది. తాజాగా ఈమె మీటూ అంటూ ఒక స్టార్ హీరో అల్లుడిపై సంచలన ఆరోపణలు చేసింది.
బాలీవుడ్ తో పోల్చితే సౌత్ లోనే ఎక్కువగా లైంగిక వేదింపులు ఉన్నాయంటూ అమైరా దస్తూర్ చెప్పుకొచ్చింది. నన్ను ఒక స్టార్ హీరో అల్లుడు లైంగికంగా వేదించేందుకు ప్రయత్నించాడు. ఆయనతో సినిమా చేస్తున్న సమయంలో నాకు చుక్కలు కనిపించాయి. ఆ హీరో నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే విషయాన్ని దర్శకుడికి చెప్పినందుకు ఆ తర్వాత నాకు నరకం చూపించారు. షూటింగ్ అంటూ ఉదయాన్నే రమ్మనేవారు - మేకప్ అయ్యి రెడీ చేస్తూ ఉన్నా కూడా గంటల తరబడి ఖాళీగా కూర్చోబెట్టేవారు. రోజంగా కూడా కనీసం అయిదు పది నిమిషాల చిత్రీకరణ కూడా చేసేవారు కాదు.
ఆ హీరో గురించి దర్శకుడికి ఫిర్యాదు చేసినందుకు అంత ఇబ్బంది పెట్టారు. అదే ఇప్పుడు అతడి పేరు బయటకు చెబితే నా కెరీర్ ను నాశనం చేస్తారు. అయినా కూడా త్వరలోనే అతడి పేరును బయటకు చెబుతాను. నాకు సౌత్ లో కెరీర్ లేకున్నా పర్వాలేదు. నేను ఆయన పేరును మీడియా ముందు చెప్పేందుకు భయపడను అంది. అమైరా దస్తూర్ చెబుతున్న ఆ హీరో ఎవరా అంటూ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ హీరో తమిళ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి అయ్యి ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం అమైరా మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది హీరోయిన్స్ కూడా స్టార్ హీరోపై సంచలన ఆరోపణలు చేస్తూ సంచలనానికి కేంద్ర బింధువు అవుతున్నారు.