'పుష్ప' క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్న‌మా ?

Update: 2022-01-28 07:30 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `అల‌వైకుంఠ‌పుర‌ములో` తెలుగులో ఎలాంటి విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. దీంతో ఈ సినిమా డ‌బ్బింగ్ హ‌క్కులు ఇత‌ర భాష‌ల్లోనూ మంచి ధ‌ర‌కు అమ్ముడుపోయాయి. హిందీలో గోల్డ్ మైన్ టెలిఫిల్మ్స్ సంస్థ  డ‌బ్బింగ్ రైట్స్ ని భారీ ధ‌ర‌కు ద‌క్కించుకుంది. ఈనెల 26న థియేట‌ర్లో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కార్తీక్ ఆర్య‌న్ హీరోగా `షెహ‌జాదా` టైటిల్ తోనూ రీమేక్ చేస్తున్నారు. దీంతో `అల‌వైకుంఠ‌పుర‌ములో` థియేట‌ర్ రిలీజ్ ప్లాన్ మారింది. థియేట‌ర్ రిలీజ్ కాకుండా టీవీలో రిలీజ్ చేసుకునేలా `షెహ‌జాదా` నిర్మాత‌ల‌- గోల్డ్ మైన్ టెలి ఫిల్మ్స్ మ‌ధ్య ఒప్పందం జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో చిత్రాన్ని దించాక్ టీవీ స‌హా సోష‌ల్ మీడియాలో రిలీజ్ హంగామా మొద‌లైంది. థియేట‌ర్ రిలీజ్ క‌న్నా టీవీ రిలీజ్ హ‌డావుడి పెద్ద ఎత్తున చేస్తున్నారు. టీవీ రిలీజ్ కే ప్ర‌త్యేకంగా టీజ‌ర్ ని క‌ట్ చేసి రిలీజ్ చేసారు. అలాగే ట్రైల‌ర్  రిలీజ్ కి రెడీ అవుతున్నారు.

ఈ హంగామా చూసిన షెహ‌జాదా నిర్మాత‌లు మ‌రోసారి దించాక్ యాజ‌మాన్యంతో మాట్లాడ‌గా ఫిబ్ర‌వ‌రి 6న ప్రీమియ‌ర్ కి  ఒప్పించారు. వాస్త‌వానికి గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్  తో థియేట‌ర్ రిలీజ్ చేయ‌కుండా స‌ద‌రు నిర్మాత‌లు 6 కోట్ల‌కు ఒప్పందం చేసుకున్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది.  ఆ త‌ర్వాత టీవీ రిలీజ్ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య స‌రైన ఒప్పందం జ‌రిగిన‌ట్లు క‌నిపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలోనే మ‌రోసారి రిలీజ్  హంగామా హ‌డావుడి చేయ‌గా..ఆ ర‌కంగాను రీమేక్ నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గించిన‌ట్లు తెలుస్తోంది. అయితే డ‌బ్బింగ్ రూపంలో టీవీలో రిలీజ్ చేయ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో గోల్డ్ మైన్ టెలీపిల్మ్స్ పై నెగిటివిటీ ఎక్కువైంది.  

డ‌బ్బింగ్ రైట్స్ ని అడ్డుపెట్టుకుని రీమేక్ నిర్మాత‌ల్ని ఇబ్బంది పెట్ట‌డం..అతి చేయ‌డంపై  నెటి జ‌నులు మండిప‌డుతున్నారు.  ఇరువురి మ‌ధ్య అవ‌గాహానా లోపం కార‌ణంగా ఈ స‌మ‌స్య తలెత్తిన‌ట్లు భావిస్తున్నారు. ఇటీవ‌లే బ‌న్నీ న‌టించిన `పుష్ప` సినిమా బాలీవుడ్ లో పెద్ద విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ ర‌కంగా బ‌న్నీ క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నంలోనూ ఇలా కొత్త గేమ్ కి తెర తీసిన‌ట్లు క‌నిపిస్తోంది.
Tags:    

Similar News