బుల్లి తెర నుండి యాంకర్స్ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. పలువురు ముద్దుగుమ్మలు ఇప్పటికే హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక మేల్ యాంకర్స్ కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ రవి ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే దారిలో ప్రదీప్ కూడా హీరోగా పరిచయం అయ్యేందుకు సిద్దం అయ్యాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ ఒక సినిమాను చేసిన ప్రదీప్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇటీవలే ఆ చిత్రంలోని పాటను మహేష్ బాబు విడుదల చేయడంతో సినిమా గురించి జనాల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం సినిమా గురించి మీడియాలో పాజిటివ్ బజ్ ఉండగా అనూహ్యంగా ప్రదీప్ పై పోలీసు కేసు నమోదు అయ్యింది. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి ఈ కేసును పెట్టాడు. కేంద్ర సెన్సార్ రూల్స్ ప్రకారం జైలుకు వెళ్లిన వారు హీరోలుగా నటించేందుకు అనర్హులు. అందుకే ఈ చిత్రంలో ప్రదీప్ హీరోగా నటించడం చట్ట విరుద్దం అంటూ కేసు పెట్టాడు.
కొన్నాళ్ల క్రితం ప్రదీప్ ఒక అమ్మాయిని వేదించిన కేసులో రెండు రోజులు జైలుకు వెళ్లాడు. కేసు నిరూపితం కూడా అవ్వడంతో ఆయన జైలు శిక్షను అనుభవించాడు. కనుక ప్రదీప్ హీరోగా నటించేందుకు అనర్హుడు అంటూ సునిశిత్ అంటున్నాడు. బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. షూటింగ్ పూర్తి కాకుంటే వెంటనే ఆపేయాలంటూ సునిశిత్ తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మరి పోలీసులు ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.