విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా వెంటనే తదుపరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మొదటి సినిమా థియేటర్లలో విడుదల అయితే రెండవ సినిమా మాత్రం ఓటీటీ లో విడుదలకు సిద్దం అయ్యింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కాబోతున్న ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి ఉంది. ఈనెల 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆనంద్ పబ్లిసిటీ కార్యక్రమాల్లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
ఈ సందర్బంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమా కథ చెప్పినప్పుడు దర్శకుడు చాలా క్లారిటీగా హీరో మనలో ఒకడిగా ఉండాలి. మనకు తెలిసిన కుర్రాడే అన్నట్లుగా ఉండాలి. మన పక్కనే ఉండే కుర్రాడి కథగా ఈ సినిమా కథ ఉంటుంది కనుక నివ్వు అయితే అందుకు సెట్ అవుతావని నిన్ను ఎంపిక చేసుకున్నాను అన్నాడు. ఈ సినిమా కోసం దోశ వేయడం నేర్చకున్నా. గుంటూరు యాసతో మాట్లాడాను. సినిమా విడుదల కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ కాలం వెయిట్ చేయడం సమంజసం కాదని అనుకున్నాము. అందుకే ఓటీటీలో విడుదలకు ముందుకు వచ్చాం.
ఇక నేను కథలు ఎంపిక చేసుకునే సమయంలో నాకు ఒక ప్రేక్షకుడిగా ఎలాంటి కథలు నచ్చుతాయో వాటినే ఎంపిక చేసుకుంటాను. విజయ్ తమ్ముడిని అని నాకో ఇమేజ్ ఉంది కదా అని కథలను ఎంపిక చేసుకోను. నా మూడవ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవ్వడానికి వచ్చింది. త్వరలోనే ఆ సినిమా గురించి పూర్తి వివరాలు వెళ్లడిస్తామంటూ ఆనంద్ ప్రకటించాడు.