భారీ కోత విధించినా ఛాన్సులివ్వ‌డం లేదా?

Update: 2022-12-10 05:16 GMT
వ‌రుస ప‌రాజ‌యాల‌తో అనన్యా పాండే డీలా ప‌డిందా?  కొత్త అవ‌కాశాల కోసం పారితోషికంలో కోత‌లు సైతం విధిస్తోందా? అంటే అవున‌నే తెలుస్తోంది. 'లైగ‌ర్' తో బ్యూటీ  టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి  ఫ‌లితాలు సాధించిందో విధిత‌మే. ఈ సినిమాపై అన‌న్య ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది.

హిట్ అందుకుని కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో స్థిర‌ప‌డిపోవాల‌ని ప్లాన్ చేసుకుంది. ఈ నేప‌థ్యంలో శ‌క్తి వంచ‌న లేకుండా ఆ సినిమా కోసం ప‌నిచేసింది. పూరి టీమ్ తో పాటు రిలీజ్ వ‌ర‌కూ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంది. సోష‌ల్ మీడియాలో వ్య‌క్తిగ‌తంగా సినిమాను ఎంతో ప్ర‌మోట్ చేసింది.  కానీ ఈ క‌ష్టం తెర‌పై క‌నిపించలేదు. ప‌ర‌మ రొటీన్ సినిమా స‌హా అన‌న్య న‌టిగా ఏం చేసింద‌ని పై పెచ్చు విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

అటు బాలీవుడ్ లోనూ అదే ప‌రిస్థితి. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ -2 తో లాంచ్ అయిన బ్యూటీ అటుపై మ‌రో రెండు సినిమాలు చేసింది. గెహ్రాయాన్ లో న‌టించినా ఆ రోల్ పరిమితంగా కావ‌డంతో సినిమా హిట్ క్రెడిట్ అంతా దీపికా ప‌దుకొణే ఖాతాలో ప‌డిపోయింది. ఆ ర‌కంగా ఆ సినిమాకు ప‌నిచేసినా అనన్య ఎఫెర్ట్ అంతా వృద్ధా ప్ర‌య‌త్న‌మే అయింది.

ప్ర‌స్తుతం హిందీలో ఓ రెండు సినిమాలు చేస్తోంది. అవి వ‌చ్చే  ఏడాది రిలీజ్ కానున్నాయి. ఇవి ఎప్పుడో క‌మిట్ అయిన ప్రాజెక్ట్ లు.  అయితే తాజా స‌మ‌చారం ఏంటంటే? అమ్మ‌డికి  ఇప్పుడు సినిమా అవ‌కాశాలే రావ‌డం లేద‌ని వినిపిస్తుంది.

ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ద‌ర్శ‌క‌-నిర్మాత‌లెవ్వ‌రూ అన‌న్య వైపు చూడ‌టం లేదుట‌. న‌టిగా ఎలాంటి పాత్ర‌కైనా అన‌న్య సిద్దంగా ఉన్నా?  పెట్టుకో వ‌డా నికి ద‌ర్శ‌కులు సిద్దంగా లేర‌ని  ప్ర‌చారం సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని దాన్ని అమ‌లు ప‌ర‌చ‌డం జ‌రిగిపోతుంద‌ని స‌మాచారం. పారితోషికంలో భారీగా  కోత విధించింద‌ట‌. దాదాపు 50 ల‌క్ష‌ల వ‌ర‌కూ  కోత వేసిన‌ట్లు స‌మాచారం. ఒక్కో సినిమాకి 80 ల‌క్ష‌లు ఛార్జ్ చేసేదిట‌. ఇప్పుడు 50 ల‌క్షలు కోసేసి 30 ల‌క్ష‌లు ఇస్తే చాలు అగ్రిమెంట్  చేసుకుందాం అంటోందిట‌. అయినా స‌రే అవ‌కాశాలు ఇవ్వ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని స‌మాచారం. మ‌రోవైపు న‌వ నాయిక‌లతో  పోటీ. మ‌రి ఈ ఫేజ్ ని ఎలా దాటుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News