సినిమాటిక్ మలుపులు తిరుగుతున్న క్రూయిజ్ డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ బాద్షా షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. అనూహ్యంగా హీరోయిన్ అనన్య పాండే పేరు తెర మీదకు రావటం.. ఆమె ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించటంతోపాటు.. ఆమెను విచారణకు పిలుస్తున్న సంగతి తెలిసిందే.
తాను డ్రగ్స్ ను వినియోగించలేదని.. తనకు దాంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఆమె.. సరదాగానే ఛాట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనన్య నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్ ఫోన్లు.. ఒక ల్యాప్ టాప్ లో.. ఛాటింగ్ కు సంబంధించిన సమాచారం మొత్తాన్ని ఆమె డిలీట్ చేసినట్లుగా గుర్తించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. పలు ఫోటోల్ని కూడా డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది.
దీంతో.. ఫోన్లు.. ల్యాప్ టాప్ లో డిలీట్ చేసిన మొత్తం సమాచారాన్ని రిట్రీవ్ చేసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారాన్ని డిలీట్ చేయటం ద్వారా.. తప్పు ఏదో జరిగిన భావనను అనన్య కలిగించినట్లైందన్న మాట వినిపిస్తోంది. అనన్య ఫోన్లో వాట్సాప్ చాటింగ్.. ఫోటోలు.. వాయిస్ నోట్లను ఆమె తొలగించినట్లుగా సమాచారం. ఆర్యన్ ఖాన్ తో ఆమె జరిపిన వాట్సాప్ చాటింగ్ లో కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా ఎన్ సీబీ దర్యాప్తులో బయటపడినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. అధికారుల విచారణలో తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తాను ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడలేదన్న మాటను ఆమె చెబుతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఆర్యన్ కు డ్రగ్స్ ను ఎవరు ఇస్తుంటారన్న సమాచారం అనన్యకు తెలుసన్న భావనలో అధికారులు ఉన్నట్లుగా చెబుతున్నారు. వారి అనుమానాలకు మరింత బలం చేకూరేలా అనన్య ఫోన్లో ఆర్యన్ ఖాన్ తో జరిపిన చాట్ ను డిలీట్ చేసిన వైనం ఉందన్న మాట వినిపిస్తోంది.