డెబ్యూ న‌టి చెల్లులు కూడా బ‌రిలో

Update: 2019-06-14 05:52 GMT
బాలీవుడ్ లో న‌ట‌వారసుల వెల్లువ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. జాన్వీ.. సారా అలీఖాన్ త‌ర్వాత అహ‌నా పాండే.. తారా సుతారియా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. స్టూడెంట్ ఆఫ్ ది ఈర్ 2 చిత్రంతో క‌ర‌ణ్ జోహార్ ఆ ఇద్ద‌రినీ ప‌రిచ‌యం చేశారు. శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషీ క‌పూర్ త్వ‌ర‌లోనే క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానుంది. ఇదే రోలో మ‌రో సెల‌బ్రిటీ కిడ్ రంగుల ప్ర‌పంచంలో అడుగు పెట్ట‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ బ్యూటీ పేరు అల‌నా పాండే. సెల‌బ్రిటీ ఫిట్ నెస్ ఎక్స్ ప‌ర్ట్ డియ‌నా పాండే కుమార్తె.  అహ‌నా పాండే కి క‌జిన్. అహ‌నా డాడ్ చుంకీ పాండేకి మేన‌కోడ‌లు వ‌రుస‌. త‌ను ఫ్యాష‌న్ డిజైనింగ్  విద్యార్థి. ప్ర‌తిష్ఠాత్మ‌క లండ‌న్ స్కూల్ ఆఫ్ ఫ్యాష‌న్ స్ట‌డీస్ లో అల‌నా డిగ్రీ పూర్తి చేసింది.

సామాజిక మాధ్య‌మాల్లో య‌మ‌స్పీడ్ గా ఉండే అందాల నాయిక‌గా అల‌న్నా పాండే పాపుల‌రైంది. ఈ అమ్మ‌డు ఇన్ స్టాగ్ర‌మ్ లో రెగ్యుల‌ర్ గా ఫోటోల్ని.. వీడియోల్ని షేర్ చేస్తూ సినీ ఎంట్రీ గురించిన ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోంది. ట్రెండ్ ని ఎంతో రెగ్యుల‌ర్ గా ఫాలో చేస్తూ ఈ 23 ఏళ్ల బ్యూటీ అంత‌ర్జాలంలో బిగ్ సెల‌బ్రిటీగా వెలిగిపోతోంది. ముంబైని వేడెక్కిస్తున్న హాట్ బ్యూటీగానూ పాపుల‌రైంది. నిరంత‌రం వేడెక్కించే ఫోటోలు వీడియోల‌తో అంత‌ర్జాలంలో వేవ్స్ ని క్రియేట్ చేస్తోంది. తాజాగా హాష్ షోల్డ‌ర్ క్రాప్ టాప్ డ్రెస్ స‌హా ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో ఫోజుల్ని సామాజిక మాధ్య‌మాల్లో రివీల్ చేసింది.

ఒక ఫ్యాష‌న్ డిజైన‌ర్ గా అల‌న్నా అభిరుచి ఇత‌రుల‌తో పోలిస్తే డిఫ‌రెంట్. త‌నకు అన్ని రంగులు ఇష్టం. కానీ తాను ప్రామిస్ చేసేది మాత్రం శాంతి సంకేతం ఉన్న రంగునే. అంటే తెలుపు త‌న‌కు బాగా ఇష్టం. ల దుస్తుల డిజైనింగ్ లో ప్ర‌యోగాలు చేసినా తెలుపు రంగుకే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంది. లెహంగా నుంచి క్రాప్ టాప్స్ వ‌ర‌కూ.. బికినీ స్విమ్ షూట్ నుంచి టూపీస్ డిజైన‌ర్ వేర్ వ‌ర‌కూ అన్నిట్లోనూ అల‌న్నా పాండే వైట్ నే ఇష్ట‌ప‌డుతుంది. ఎక్కువ‌గా వాటినే ధ‌రిస్తుంది కూడా. త‌ను ఇన్ స్టాలో పోస్ట్ చేసే లైఫ్ స్టైల్ ఫోటోలు.. వీడియోల ద్వారా ఇప్ప‌టికే బోలెడంత‌ పాపుల‌రైంది. వీటి ద్వారా త‌న స్టైల్ ని ఎలివేట్ చేస్తోంది. తాజాగా లండ‌న్ టూర్ వెళ్లిన‌ప్ప‌టి ఫోటోల్ని షేర్ చేసింది.

   
   
   

Tags:    

Similar News