బోయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పేసిన అన‌న్య పాండే!

Update: 2022-04-12 06:28 GMT
యంగ్ హీరోయిన్ అన‌న్య పాండే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో కెరీర్ ని  బిల్డ్ చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. కుర్ర నాయిక‌ల్లో అంద‌రిక‌న్నా  యాక్టివ్ గా దూసుకుపోతున్న హీరోయిన్ గా పేరు సంపాదించింది. బాలీవుడ్ లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్' తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అటుపై బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకుని పూల బాట  నిర్మించుకుంది. ఇదే స‌మ‌యంలో యంగ్ హీరో 'ద‌ఢ‌క్' ఫేమ్ ఇషాన్ క‌ట్ట‌ర్ తో ప్రేమాయ‌ణంలోనూ ప‌డింది. 3 ఏళ్ల‌గా అత‌నితో రిలేష‌న్ కొన‌సాగిస్తుంది.

ప‌బ్ లు..విదేశీ ట్రిప్పులు అంటూ  ఈ మూడేళ్లు బాగానే ఎంజాయ్ చేసారు. స‌రిగ్గా నెల రోజుల‌కు ముందే మ‌రో ట్రిప్ ముగించుకుని వ‌చ్చారు.

మ‌రి ఇంత‌లోనే ఏం జ‌రిగిందే ఏమో! గానీ సెట్ అవ్వ‌దంటూ అన‌న్య ఇషాన్ కి దూరంగా జ‌రిగిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇషాన్ తో ఈక్వెష‌న్ సెట్ అవ్వ‌లేద‌ని..క‌లిసి ఉంటే రోజు వివాదాలే క‌నిపిస్తాయ‌ని భావించి బ్యూటీ గుడ్ బై చెప్పేసింద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

దీంతో ఈ వార్త బాలీవుడ్ మీడియాలో ఆస‌క్తిక‌రంగా మారింది. విడిపోవ‌డం ఎంత వ‌ర‌కూ నిజం?  ఇది గాలి వార్త‌?  నిజంగానే  బ్రేక‌ప్ చెప్పుకున్నారా?  ఒక‌వేళ అదే జరిగితే అస‌లు కార‌ణాలు ఎంటి? అని తవ్వే ప్ర‌య‌త్నాలు అప్పుడే మొద‌లైపోయాయి. ఇదే గ‌నుక నిజ‌మైతే  ఇషాన్ ఖాతాలో సెకెండ్ వికెట్ ప‌డిన‌ట్లేన‌ని  బాలీవుడ్ వ‌ర్గాలు డిస్క‌స్ చేసుకుంటున్నాయి.

ఇషాన్ డెబ్యూ మూవీ లో న‌టించిన జాన్వీ క‌పూర్ తోనూ యంగ్ హీరో కొన్నాళ్ల పాటు రిలేష‌న్ లో ఉన్న‌ట్లు అప్ప‌ట్లో మీడియా క‌థ‌నాలు వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇద్దరు జంటగా ప్ర‌యివేటు ప్లేస్ ల్లో  కెమెరాకి చాలాసార్లు చిక్కారు. ఇద్ద‌రి మ‌ధ్య ఆ బంధం అలా కొన్నాళ్లే కొన‌సాగింది.

ఆమెతో బ్రేక‌ప్  త‌ర్వాత అన‌న్య‌తో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఇక్క‌డో విష‌యం గ‌మ‌నించాలి. వీళ్లంతా ఒకే గ్యాంగ్. స్నేహితుల్లా క‌లిసి ఉంటారు. ఒకే వ‌య‌స్కులు. వెండి తెర‌కు ప‌రిచ‌యం అయిన త‌ర్వాత ఈ ప్రేమ వ్య‌వ‌హారాలు మొద‌ల‌య్యాయి.

ఇక అన‌న్య పాండే తెలుగులో 'లైగ‌ర్' సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ దేవ‌రకొండ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. రిలీజ్ కి ముస్తాబుతోంది. ఇంత‌లోనే  అమ్మ‌డి బ్రేక‌ప్ వార్తతో  టాలీవుడ్ ఆడియ‌న్స్ ని నిరుత్సాహ ప‌రించింది.
Tags:    

Similar News