రకుల్‌ తో పోటీ పడుతున్న అనసూయ

Update: 2016-01-26 04:20 GMT
అవార్డు ఫంక్షన్లంటే అందాల ఆరబోతకు ప్రధాన కేంద్రంగా మారిపోయాయ్‌. మొన్నటివరకు బాలీవుడ్‌ లోనే ఇలాంటి కల్చర్‌ ఉందేమో.. కేవలం అక్కడ సోనమ్‌ కపూర్‌ వంటి భామలు మాత్రం అలాగే క్లీవేజ్‌ అందాలో బ్యాక్‌ లెస్‌ వడ్డనలతో వీక్షలకు పిచ్చెత్తిస్తారు అనే భావన ఉండేది. కాని ఇప్పుడు ఆ ఫీలింగును శాశ్వతంగా మార్చేస్తున్నారు మన భామలు కూడా.

మొదటి రోజున బ్యాక్‌ లెస్‌ అందాలతో చీర సింగారంలో మత్తెక్కించిన రకుల్‌ ప్రీత్‌.. ఐఫా అవార్డుల రెండో రోజున కూడా అదరగొట్టేసింది. ఓపెన్‌ బ్యాక్‌ గౌనులో.. ముందర క్లీవేజ్‌ ను ఆరబోస్తూ.. ఫిలింఫేర్‌ లో కాజల్‌ రఫ్ఫాడించినట్లు కనువిందు చేసింది. ఇక ఈమెతో మిగిలిన స్టార్‌ బ్యూటీల్లో శృతి ఒక్కత్తే పోటీ పడింది. యథావిథిగా యద అందాలతో కనువిందు చేసింది. తమన్నా - అదా శర్మ - ప్రగ్యా జైస్వాల్‌ మొదలగు భామలందరూ తేలిపోయారులే.

ఇక రెండో రోజున రకుల్‌ కు గాట్టి పోటీ ఇచ్చిన భామెవరంటే.. మన యాంకర్‌ అనసూయనే. ఎందుకంటే అమ్మడు కూడా బ్యాక్‌ లెస్‌ తో రచ్చ రచ్చ చేసిపాడేసింది. ఫోటోగ్రాఫర్లు అడగకపోయినా కూడా.. ఆ వీపు సోయగాలకు కెమెరా కళ్ళలో బంధించుకోండి అంటూ ఫోజులిచ్చింది. అది సంగతి.
Tags:    

Similar News