సోషల్ మీడియాల్లో విచ్చలవిడితనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఈ వేదికపై సెలబ్రిటీలు తీవ్ర వేదింపులకు గురవుతున్నారు. ముఖ్యంగా అనసూయ లాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ కం నటికి ఇలాంటి వేధింపులు తప్పడం లేదు.
ఇప్పటికే ట్రోలర్స్ వర్సెస్ అనసూయ ఎపిసోడ్స్ ఎంతో సంచలనంగా మారాయి. అయితే మహిళా దినోత్సవం రోజున అనసూయ చేసిన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఇది మహిళా దినోత్సవం కాదు ఫూల్స్ డే అని అనసూయ సంచలన వ్యాఖ్యను చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమ జీవితంలో శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంది పురుష పుంగవులు పరుషపదజాలాన్ని విడిచిపెట్టారు. చక్కని మంచి సందేశాలు ఇవ్వడం నేర్చుకున్నారు ఈరోజు. నిజానికి ఇది సరిపోదు.
చాలా మంది స్త్రీలు పురుషులు మహిళా దినోత్సవం రోజున మాత్రమే కాకుండా ప్రతిరోజూ స్త్రీలను అదే విధంగా చూడాలని కోరుకుంటారు. టాప్ యాంకర్ అనసూయ ఈ కేటగిరీనే అని నిరూపణ అయ్యింది. చాలా మంది పురుషులను తనదైన శైలిలో అనసూయ ఈరోజు ఎగతాళి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు కొందరు పురుషులు ఆడవారిని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆకస్మికంగా గ్రహించారు అంటూ సెటైర్లు వేసింది అనసూయ.
``ఓహ్! ప్రతి ట్రోలర్.. మీమ్ మేకర్ హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభించే రోజు ఇది అని అకస్మాత్తుగా గ్రహించారు.. ఇదంతా 24 గంటల్లో ముగుస్తుంది! కాబట్టి మీరందరూ అక్కడ(ఈ వేదికపై) ఉన్న స్త్రీలు! శుభ అవివేకుల రోజు!!`` అని ఘాటుగా ట్వీట్ చేశారు అనసూయ. నా ట్వీట్ క్రింద ఆ `గుమ్మడికాయ దొంగలు` కామెంట్ చేయడం మీరు చూస్తారు!! అయినా మీకు మంచి జరగాలి!! అంటూ మరో ట్వీట్ లో ఘాటుగా వ్యాఖ్యానించారు.
వేధింపులు తనను ఏ రేంజులో చికాకు పెట్టాయో దీనిని బట్టి అర్థమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఉన్న ప్రతికూలత అంతా ఇంతా కాదు. అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న గ్లామరస్ యాంకర్ కి ఇది మరింత సమస్యగానే చూడాలి.
ఇటీవలే ఖిలాడీ చిత్రంలో అందాల ఆరబోతతో చెలరేగిన అనసూయ పుష్ప లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలోనూ నటించారు. మునుముందు పలు క్రేజీ చిత్రాలతో తెలుగు అభిమానులను అలరించనున్నారు. అనసూయకు నిర్ధ్వంద్వంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.