పాపులర్ యాంకర్ అనసూయ భరద్వాజ్ నటిగా కూడా టాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. గతంలో 'క్షణం' లాంటి కొన్ని సినిమాల్లో నటించి అందరినీ మెప్పించిన అనసూయకు నటిగా పెద్ద బ్రేక్ మాత్రం 'రంగస్థలం' తోనే వచ్చింది. ఆ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత అనసూయకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట.
కొరటాల శివ తన కొత్త సినిమాను మెగాస్టార్ చిరంజీవితో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'సైరా' షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ సినిమాలో అనసూయకు మంచి ప్రాధాన్యత ఉండే ఒక పాత్రను ఆఫర్ చేశాడట కొరటాల. మెగాస్టార్ చిరంజీవి- కొరటాల కాంబినేషన్ అంటే క్రేజీ ప్రాజెక్ట్ కదా.. అందుకే వెంటనే ఈ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమా కాకుండా మరో క్రేజీ ఆఫర్ కూడా అనసూయకు వచ్చిందట. 'రంగస్థలం' తో అనసూయకు బ్రేక్ ఇచ్చిన సుకుమార్ మరోసారి తన నెక్స్ట్ సినిమాలో కీలకమైన పాత్ర ఆఫర్ చేశాడట. సుకుమార్ తన నెక్స్ట్ సినిమాను అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా క్రేజీ ప్రాజెక్టే.
అనసూయకు వస్తున్న క్రేజీ ఆఫర్లు చూస్తుంటే త్వరలో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడం ఖాయమే అనిపిస్తోంది. బుల్లితెరపై యాంకర్ గా భారీ గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఇప్పుడు వెండితెరపైకూడా అదే ఫీట్ రిపీట్ చేస్తోంది. టాలెంట్ ఉన్నప్పుడు బుల్లితెర అయినా.. వెండితెర అయినా రెడ్ కార్పెట్ పరవకుండా ఎలా ఉంటుంది?