గాడ్స్ ఓన్ కంట్రీలో.. రంగ‌మ్మ‌త్త సంద‌డి!

Update: 2021-04-19 06:31 GMT
జూనియ‌ర్ ఆర్టిస్టుగా సైడు క్యారెక్ట‌ర్ల‌తో కెరీర్ ప్రారంభించి, ఆ త‌ర్వాత 'జ‌బ‌ర్ద‌స్త్' యాంకర్ గా మారిపోయి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హాట్ బ్యూటీ అనసూయ. తనదైన మాటతీరుతోపాటు అందాల ప్రదర్శనకు ఏ మాత్రం మొహ‌మాట ప‌డ‌ని అన‌సూయ‌.. ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ త‌న‌దైన గుర్తింపుతో దూసుకెళ్తోంది.

ఇటు యాంక‌ర్ గా.. అటు యాక్ట్రెస్ గా డ్యుయ‌ల్ రోల్ ప్లే చేస్తున్న ఈ గ‌రం మ‌సాలా బ్యూటీ.. సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. త‌న కెరీర్ తోపాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే.. తాజాగా గాడ్స్ ఓన్ కంట్రీగా పేరొందిన‌ కేర‌ళ‌లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ను షేర్ చేసింది అను.

కేర‌ళ అంటేనే ప్ర‌కృతి అందాల‌కు కేరాఫ్‌. స‌మ్మ‌ర్ టూర్ ప్లాన్ చేసిన అన‌సూయ‌.. ఫ్యామిలీతో చెక్కేసింది. అక్క‌డి స‌ముద్ర జ‌లాల్లో, టూరిస్ట్ డెస్టినేష‌న్ స్పాట్స్ లో అందాల‌ను ఆస్వాదిస్తోంది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ కు లైకుల వ‌ర్షం కురుస్తోంది.

ఇక‌, ఈ అమ్మ‌డి సినిమా కెరీర్ గురించి చూస్తే.. ఇప్ప‌టికే పాపుల‌ర్ అయిన రంగ‌మ్మ‌త్త‌.. త‌న టాలెంట్ ను సౌత్ లో విస్త‌రిస్తోంది. త‌మిళ్‌లో విజ‌య్ సేతుప‌తి తో క‌లిసి న‌టించ‌నున్న అన‌సూయ‌.. మ‌లయాళంలో మ‌మ్ముట్టితో సినిమా చేస్తోంది. ఇక‌, తెలుగులో ప‌వ‌ర్ స్టార్ తో క‌లిసి న‌టించ‌బోతున్న‌ట్టు ఈ మ‌ధ్య‌నే ప్ర‌క‌టించింది. మొత్తానికి.. అటు కెరీర్ ను, ఇటు లైఫ్ ను జోడుగుర్రాలుగా మార్చి అద్దిరిపోయే స‌వారీ చేస్తోంది అన‌సూయ‌.

Full View
Tags:    

Similar News