అనసూయ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది. తాను లీడ్ రోల్ ల్లో కనిపించిన సినిమాలకు మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సినిమా ల యొక్క ప్రమోషన్ లో కూడా అనసూయ కనిపించిన విషయం తెల్సిందే. తాను నటించిన దాదాపు అన్ని సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో ఏదో ఒక స్థాయిలో పాల్గొనే అనసూయ తాను లీడ్ రోల్ లో నటించిన 'దర్జా' సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో మాత్రం కనిపించడం లేదు.
చాలా రోజుల క్రితమే ఈ సినిమా విడుదల గురించి వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఈ వారం దర్జా ను విడుదల చేయబోతున్నారు. సునీల్ ఇంకా అనసూయలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం చిత్ర యూనిట్ సభ్యులు కిందా మీదా పడుతున్నారు.
ఈ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలకు అనసూయ హాజరు కాకపోవడం తో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్జా సినిమా పట్ల అనసూయ ఆసక్తిగా లేదని కొందరు.. నిర్మాతలతో విభేదాలు అంటూ మరి కొందరు రకరకాలుగా సోషల్ మీడియాలో తమ అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దర్జా సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజు సమయం ఉన్నా కూడా అనసూయ ఎక్కడ కనిపించకపోవడంతో ఆ వాదనకు బలం చేకూరినట్లు అయ్యింది.
వివాదం గురించి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనసూయ స్పందించింది. వివాదం ఏమీ లేదని స్పష్టతనిచ్చింది. దర్జా సినిమా ప్రమోషన్ లో పాల్గొనక పోవడం కు కారణం తాను హైదరాబాద్ కు దూరంగా వేరే ప్రాజెక్ట్ ల యొక్క షూటింగ్స్ తో బిజీగా ఉండటం అంటూ చెప్పుకొచ్చింది.
చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు ఒక్క సారిగా పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకే దర్జా సినిమా కు సమయం కేటాయించడం కుదరడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. దర్జా సినిమా నిర్మాతలకు కూడా ఆ విషయం తెలుసని.. వారు అర్థం చేసుకున్నారు అన్నట్లుగా వివాదం లేదనే విషయాన్ని నొక్కి మరీ చెప్పే ప్రయత్నం చేసింది.
అసలే పెద్దగా హైప్ లేదు.. అది కాకుండా హడావుడిగా విడుదలకు సిద్ధం చేశారు.. పైగా అనసూయ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దాంతో దర్జా ఫలితం ఎలా ఉంటుంది.. ఓపెనింగ్స్ పరిస్థితి ఏంటీ అనే విషయాన్ని తలుచుకుంటే కాస్త గందరగోళంగా ఉన్నట్లుగా అనసూయ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.