హాట్ యాంకర్.. 9 ఇయర్స్ లవ్ స్టోరీ

Update: 2016-04-03 09:30 GMT
న్యూస్ ప్రెజెంటర్ నుంచి యాంకర్ - యాంకర్ నుంచి యాక్టర్ గా మారిన అనసూయ.. ప్రస్తుతం సినిమా కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేసింది. చాలా రకాల ఆఫర్స్ వదులుకుని.. చేసిన రెండు సినిమాలు సక్సెస్ సాధించడంతో చాలా ఆనందంగా ఉంది అనసూయ.

హాట్ యాంకర్ గా ఉన్నప్పటి నుంచి, సినిమాల వరకూ అనసూయపై చాలా రకాల రూమర్స్ వచ్చాయి. అయితే.. ఇలాంటి వాటిపై మొదట చాలా ఫీలయిపోయి, అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసింది. అయితే పబ్లిక్ ఫిగర్ గా ఉన్నపుడు ఇలాంటివి తప్పవని జ్ఞానోదయం అయిందని అంటోదీ యాంకర్ కం యాక్టర్. ఏం చేసిన తప్పుపట్టేవాళ్లు ఉంటారని.. అందుకే ఇలాంటి రియాక్షన్లపై పొదుపుగా రియాక్ట్ అవాలని డిసైడ్ అయిందట అనసూయ.

రియల్ లైఫ్ లో అనసూయది లవ్ మ్యారేజ్ కావడం విశేషం. ఎన్సీసీ కేడెట్ గా ఉన్నపుడు ఇద్దరూ ఒకే క్యాంప్ లో ఉండేవారట. ప్లస్ టూ చదువుతున్నపుడు ప్రపోజ్ చేయగా... నాలుగేళ్ల తర్వాత ఓకే చెప్పానంది అనసూయ. అయితే ఇంట్లో సంబంధాలు వెతకడం చూశాక.. అప్పుడు తండ్రికి ఈ విషయం చెప్పానంది అనసూయ. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఐదేళ్ల సమయం పట్టిందట. అలా చివరకు 2010లో పెళ్లిచేసుకున్నామని చెప్పిందీమె. భర్త అందించే సహకారంతోనే తను కెరీర్ లో ఈ స్థాయికి చేరుకున్నా అని ఆనందంగా చెప్పింది అనసూయ.
Tags:    

Similar News