నాకు నా భర్తే బలం.. అన్నీ: స్టార్ యాంకర్

Update: 2020-06-05 08:15 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో.. అనసూయ యాంకర్‌గాను.. అటు యాక్టర్ గాను ఫేమస్ అవుతుందంటే.. అనసూయ టాలెంట్ వెనుక ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ ప్రోత్సాహం కూడా ఉంది. భర్త వలనే అనసూయ సినీ ఇండస్ట్రీలో రాణించ గలుగుతున్నాను అని చాలాసార్లు మీడియా పరంగా ప్రకటించింది. ఇక తాజాగా తన భర్త పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది అనసూయ. నిన్న అనసూయ - సుశాంక్ ల పెళ్లిరోజు.. అంతేగాక ఇది వారికి 10వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా తన భర్తను ఉద్దేశిస్తూ.. తన భర్తతో సన్నిహితంగా ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది. ఆ ఫోటోను ఉద్దేశించి.. ‘‘నా బలం, నా భయం, నా గందరగోళం, నా బ్యాలెన్స్, నా రెక్కలు.. ఇలా అన్నీ నువ్వే. నీ ప్రోత్సాహం లేకుండా నేను ఏం చేయగలనో నాకు తెలీదు. ప్రతిసారి మనం పోట్లాడుకుంటాం. ఇంకెప్పుడూ నీతో మాట్లాడకూడదు అని అనుకుంటా. నేనొక ఫూల్‌.. నీతో మాత్రమే జీవించడం నేర్చుకున్నాను. ఇంతకు మించి నాకేం తెలీదు. ఇక ఇది మన 10వ పెళ్లిరోజు. కానీ, మనం ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే ఉంటామని నీకు, నాకు తెలుసు. థానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్‌ను ప్రేమించినంత గొప్పగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మెంటల్’’ అని అనసూయ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన భర్తపై ప్రేమను కురిపించింది.

అయితే అనసూయ - సుశాంక్ లది 9ఏళ్ల లవ్‌స్టోరీ. అనసూయ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో ఓ ఎన్‌సీసీ క్యాంప్‌కు వెళ్లిందట. ఆ క్యాంప్‌కి సుశాంక్ కూడా వచ్చి.. అనసూయ చలాకీతనం చూసి ఇష్టపడ్డాడట. వెంటనే తన ప్రేమ విషయం అనసూయకు చెప్పేశాడు. అనసూయ కూడా భరద్వాజ్‌ను ఇష్టపడి వెంటనే నిర్ణయం చెప్పలేదట. అయితే, ఏడాదిన్నర తర్వాత మరోసారి ఎన్‌సీసీ క్యాంప్‌లో వీరిద్దరూ కలుసుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటానని భరద్వాజ్ అనసూయతో చెప్పాడట. అప్పుడు అనసూయ కూడా ఓకే చెప్పిందట. ఇది జరిగిన మూడేళ్ల తరవాత అనసూయకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారట. దీంతో తన ప్రేమ విషయం తల్లికి చెప్పింది. కానీ లవ్ మ్యారేజ్ కి అనసూయ తండ్రి నో అన్నారట. ఎందుకంటే అనసూయకు చెల్లెల్లు ఉన్నారు. వాళ్లకు మంచి సంబంధాలు రావాలంటే అనసూయకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేయడమే కరెక్ట్ అని ఆయన అనుకున్నాడట. కానీ అనసూయకు అరెంజ్ మ్యారేజ్ ఇష్టంలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ టైంలో భరద్వాజ్ మాత్రం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడట. 9ఏళ్లు వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి 2010 జూన్ 4న పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నట్టు అనసూయ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Tags:    

Similar News