'మీ టూ'.. అనసూయ ఏమందంటే.?

Update: 2018-10-11 05:40 GMT
‘మీ టూ’.. ఇప్పుడు ఎక్కడే చూసినా ఇదే మాట.. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఒక్కరొక్కరుగా గళమెత్తుతుంటే మొత్తం దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. మొన్న తనుశ్రీ దత్తా.. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగిక వేధింపులు చేశాడని ఆరోపించింది. నిన్న ఏకంగా బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ తనపై అత్యాచారం చేశాడని రచయిత - నిర్మాత వింటానందా సంచలన ఆరోపణలు చేసింది. ఇలా ‘మీటూ’ వ్యవహారం అటు సినిమా రంగాన్నే కాదు.. రాజకీయ - మీడియా రంగాలకు కూడా పాకుతోంది.

ఇక దక్షిణాదిన కూడా ఈ ‘మీటూ’ మంటలు అంటుకున్నాయి.  గాయని చిన్నయి తనను గదికి రమ్మని లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ రచయితపై తీవ్ర ఆరోపణలు చేసింది. తాజాగా ఈ ‘మీటూ’ వ్యవహారంపై బుల్లితెర స్టార్ యాంకర్ అనుసూయ స్పందించింది.

అనసూయ మాట్లాడుతూ.. ‘పనిచేసే చోట లైంగిక వేధింపులు అత్యంత దురదృష్టకరం.. ఈ లైంగిక వేధింపుల బాధితుల్లో మహిళలే కాదు.. చిన్న పిల్లలూ.. ఆఖరికి మగవాళ్లు కూడా ఉంటున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరి ప్రలోభాలకు గురికాకుండా.. ధైర్యంగా ఉంటే లైంగిక వేధింపుల బారిన పడకుండా ఉండొచ్చని సలహా ఇచ్చింది అనసూయ. తాను చూసినంత వరకూ టాలీవుడ్ లో లైంగిక వేధింపులు తక్కువేనని వివరణ ఇచ్చింది.

అనసూయ ఇండస్ట్రీలో టాప్ ఉండడంతో ఆచితూచి మాట్లాడినట్టు అర్థమైంది. కాగా టాలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. చాలా మంది నటులు కూడా ఈ వేధింపులపై రోడ్డెక్కారు. అనసూయ మాత్రం కర్ర విరగకుండా పాము చావకుండా సమయానుసారంగా మాట్లాడినట్టు అర్థమవుతోంది.  
Tags:    

Similar News