మాస్ మహారాజా రవితేజ `క్రాక్` బ్లాక్ బస్టర్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశారు. ఈ మూవీ అందించిన సక్సెస్ ఆనందంలో రెట్టించిన ఉత్సాహంతో వున్న రవితేజ ప్రస్తుతం వరుసగా ఐదారు చిత్రాల్ని లైన్ లో పెట్టేశారు. ఇందులో చాలా వరకు చిత్రాలు సెట్స్ పైకి వచ్చేశాయి. రమేష్‌వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రవితేజ డ్యుయెల్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతీ హీరోయిన్ లుగా నటించారు. గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రల్లో రవితేజ నటించిన ఈ చిత్రం ద్వారా రవితేజ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.
ప్రీ రిలీజ్ బిజినెస్ హిట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 11న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని ఉత్తరాదిలో పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతి లాల్ గడ రిలీజ్ చేస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయికి ఈ మూవీ థియేట్రికల్ హక్కులు అమ్ముడు పోవడం గమనార్హం. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రవితేజ కెరీర్లోనే ఈ స్థాయిలో థియేట్రికల్ హక్కుల రూపంలో భారీ మొత్తాన్ని దక్కించుకున్న సినిమాగా `ఖిలాడీ` రికార్డు సాధించింది.
ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి ఆకట్టుకుంటోంది.ఇందులో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా వుంటుందని, ఈ పాత్ర కథకు చాలా కీలకంగా వుంటుందని చెబుతున్నారు. తాజాగా అనసూయకు సంబంధించిన మరో సర్ ప్రైజింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే ఇందులో ఆమె కూడా రవితేజ తరహాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల బన్నీ నటించిన `పుష్ప`లో సునీల్ వైఫ్ దాక్షాయణిగా ఊర మాస్ పాత్రలో కనిపించి షాకిచ్చిన అనసూయ `ఖిలాడీ`లో నే సర్ ప్రైజింగ్ క్యారెక్టర్ లో కనిపించి షాకివ్వబోతోందని తెలిసింది. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్న అనసూయ ఓ పాత్రలో ట్రెడిషనల్ గా కట్టూ బొట్టుతో కనిపించబోతుండగా, మరో పాత్రలో ఆల్ట్రా మోడ్రన్ గాళ్ గా కనిపించబోతోందట. ఈ రెండు పాత్రల్లోనూ అనసూయ తనదైన నటనని కనబరిచిందని, ఈ కెండు పాత్రలు అనసూయకు మంచి పేరుని తెచ్చిపెడతాయని చెబుతున్నారు.