రంగస్థలం ఊరు అందులోని చిట్టిబాబు... ఎంతమందికి నచ్చేశారో. అసలు ఆ రెండింటి కోసమే సినిమాను అదే పనిగా చూసే వాళ్లు ఉన్నారు. అందుకే కదా కొత్త సినిమాలు ఎన్ని విడుదలవుతున్నా... రంగస్థలం మాత్రం ఇంకా కొన్ని థియేటర్లలో ఆడుతూనే ఉంది. రామలక్ష్మి రంగమ్మత్త ఆ పాటలు ఆ పొలాలూ అన్నీ కళ్లను మనసును కట్టి పడేశాయ్ మరి. అలాంటి సినిమాను అప్పుడే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 14న అంటే ఈరోజునే ప్రసారం చేశారు. రంగమ్మత్తతో పాటూ ఎంతో మంది ఆ సినిమా చూసే పనిలో బిజీగా ఉన్నారు చూడండి.
రంగమ్మత్త పాత్ర కూడా అనసూయకు అదృష్టం కొద్దీ వచ్చింది. నటనకు ఆస్కారమున్న పాత్ర దొరకడంతో అనసూయ కూడా రెచ్చిపోయి నటించేసింది. మంచి పేరు కొట్టేసింది. అప్పట్నించి ఆమెకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో పాటూ అత్తా అన్న పిలుపును సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తున్న రంగస్థలం సినిమాను ఇంట్లో చూస్తూ ఓ ఫోటో దిగింది రంగమ్మత్త. ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఆ పోస్టుకు యూత్ అంతా స్పందిస్తున్నారు. ఆమెను ప్రేమగా అత్తా అని పిలుస్తూ కామెంట్లు పెట్టారు. మరికొందరు థియేటర్లో బాగానే ఆడుతోందిగా ఎందుకిలా ప్రసారం చేస్తున్నారని కూడా ప్రశ్నించారు. ఆ ఫోటోలో రంగమ్మత్తకు రివర్సులో ఉంది అనసూయ. స్లీవ్ లెస్ టాప్ లో కళ్లకి స్టైలిష్ గాగుల్స్ తో ఏదో తింటూ సినిమా చూస్తోంది.
కేవలం అనసూయే కాదు అమెజాన్ లో ఈ రోజు రంగస్థలం చూస్తూ బిజీగా ఉన్న వాళ్లు చాలానే ఉన్నారు. రంగస్థలం సినిమాకు అభిమానులు భారీగానే ఉండడంతో థియేటర్లలో ఆడుతుండగానే అమెజాన్ ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకునేందుకే రంగంలోకి దిగింది. సినిమా హక్కులను ముందే కొనుక్కుని ప్రసారం చేస్తోందన్న వాదన ఉంది.