యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ.. తన మాటలతోనే కాకుండా తన అందాలతో ఆకట్టుకుంది. ఆమె క్రేజ్ చూసి చాలా మంది దర్శకనిర్మాతలు పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒకవైపు స్మాల్ స్క్రీన్ పై పలు షోలు చేస్తూనే మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతోంది అందాల అనసూయ. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ స్టార్ యాంకర్.. క్రమం తప్పకుండా వేడిపుట్టించే ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఒక పక్క సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే మరో పక్క గ్లామర్ షో చేస్తూ కనువిందు చేస్తుంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో కలిసి ఉన్న ఒక రొమాంటిక్ ఫోటోని అనసూయ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో థైస్ కనిపించేలా పొట్టి దుస్తుల్లో ఉన్న అనసూయ.. తన భర్తను ప్రేమతో హత్తుకుని కనిపిస్తోంది. దీనికి 'నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి మరోసారి ఛాన్స్ తీసుకుంటున్నాను' అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే అనసూయ వివాహం 2010 వాలెంటైన్స్ నెలలోనే జరగడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2020 సంవత్సరానికి వీరి పెళ్లి జరిగి దశాబ్ద కాలం పూర్తవుతోంది.