మగాళ్ళు ఇలా తిరగకూడదట.. రష్మికి నచ్చదు!

Update: 2019-02-07 06:51 GMT
మహిళల వస్త్రధారణ ఎలా ఉండాలనే విషయంలో చాలా రోజుల నుండి చర్చ జరుగుతూనే ఉంది.  మహిళలు ధరించే దుస్తులు పద్ధతిగా ఉండాలని.. ఎక్స్ పోజింగ్ చేస్తూ వేసుకొనే దుస్తులు మన కల్చర్ కాదని కొందరు సంప్రదాయవాదులు నీతులు చెప్తూ ఉంటే..  తప్పు ఆడవాళ్ళ దుస్తుల్లో లేదని.. మగవాళ్ళ కామం నిండిన చూపుల్లో ఉందని నాగబాబు లాంటివారు ఫైర్ అవుతున్నారు.  ఈమధ్య నాగబాబు ఈ విషయంపై మాట్లాడుతూ అసలు మహిళలకు ఇలాంటి దుస్తులే వేసుకోవాలని రూల్స్ చెప్పే హక్కు మనకు ఎక్కడ ఉందని ప్రశ్నించాడు.  ఇకపై మహిళలు కూడా మగవాళ్ళు  నిక్కర్లు వేసుకోకూడదు.. చొక్కా లేకుండా తిరగకూడదు అని రూల్స్ పెడితే మీరు పాటిస్తారా అని కూడా ప్రశ్నించాడు.

ఈ వీడియోకు యాంకర్లు అనసూయ భరద్వాజ్.. రష్మి గౌతమ్ ఇద్దరూ తమ మద్దతు తెలిపారు.   ఇదిలా ఉంటే రీసెంట్ గా రష్మి గౌతమ్ ట్విట్టర్ లో చాట్ చేస్తున్న సమయంలో ఒక ఫాలోయర్ ఈ విషయంపై ప్రశ్నిస్తూ "మనం ఒక సమాజంలో ఉన్నాం కాబట్టి మగవాళ్ళకు.. ఆడవాళ్ళకు ఇద్దరికీ రూల్స్ ఉంటాయి. మరి మగవాళ్ళ డ్రెసింగ్ లో మీకు నచ్చని అంశాలు ఏంటి? అని అడిగాడు.  ఈ ప్రశ్నకు ఓ జబర్దస్త్ ఇచ్చింది రష్మి.  

"నాకు షార్ట్స్ వేసుకుకొని కాళ్ళపై బొచ్చుతో తిరిగేవారంటే  ఇష్టం లేదు.  ఇక కట్ బనీన్లు వేసుకొని చంకల్లో వెంట్రుకలు కన్పిస్తూ ఉన్నా నచ్చదు. హాఫ్ షర్ట్స్ వేసుకొని చేతులను ఓవర్ గా ఎక్స్ పోజ్ చేస్తే నచ్చదు.  బీచుల్లో చొక్కా బనియన్లు లేకుండా వేలాడే చెస్ట్ తో అటూ ఇటూ తిరిగేవాళ్ళంటే అస్సలు నచ్చదు.. ఇవి కొన్నే.  ఇంకా ఉన్నాయి.. నా లిస్టు చాలా పెద్దది" అంటూ ముగించింది.  అర్థమైందా మగమహారాజులూ.. కాస్తా అటూ ఇటూ రష్మి లాంటి వారు ఉన్నారా లేదా చూసుకొని తిరగండయ్య. మీ ఫ్రీడం తగలబడ.. మగవారికందరికీ చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నారే!
Tags:    

Similar News