తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఈ వారం అనూహ్యంగా యాంకర్ రవి బయటకు వచ్చేశాడు. ఆయన టాప్ 5 కి ఖచ్చితంగా నూటికి నూరు శాతం అర్హుడు అంటూ అంతా చాలా బలంగా చెబుతున్నారు. అయితే ఆయన ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అనేది ఇప్పుడు అందరిలో వినిపిస్తున్న ప్రశ్న. రవి ఎలిమినేషన్ విషయం ఇప్పటికే బయటకు పొక్కింది. ఆది వారం ఎపిసోడ్ లో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. కాజల్.. సిరి.. ప్రియాంక ఉండగా ఎలా రవి ఎలిమినేట్ అయ్యాడు అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎలిమినేషన్ ఏమాత్రం సబబు కాదు. అసలు ఇది ఒక జెన్యూన్ ఎవిక్షన్ కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి బిగ్ బాస్ టీమ్ వారు ఓట్లను ఆధారంగా కాకుండా తమకు ఇష్టం వచ్చిన వారిని ఎలిమినేట్ చేశారంటూ వాదనలు వినిపిస్తుంటే.. మరో వైపు రవి స్వయంగా తనను బయటకు పంపించాలంటూ కోరుకోవడం వల్లే ఎలిమినేట్ చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
రవికి ఓట్లు తక్కువ ఓట్లు రావడం వల్లే ఎలిమినేషన్ అయ్యాడని విశ్లేషకులు చెబుతున్నారు. విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం అత్యల్పంగా కాజల్ కు ఓట్లు వచ్చాయి.. ఆ తర్వాత యాంకర్ రవికి వచ్చాయి. ప్రియాంక కింది నుండి మూడవ స్థానంలో నిలిచిందట. ఈ వారం మొదటి మూడు రోజులు ప్రియాంక చివర్లో ఉంది. ఖచ్చితంగా ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కాని ఒక వర్గం వారు.. హౌస్ లోకి ఒక స్టార్ కంటెస్టెంట్ అభిమానులు అనూహ్యంగా రవిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రియాంక సింగ్ కు ఓట్లు గంప గుత్తగా వేశారట. దాంతో రెండు రోజుల్లోనే ప్రియాంక ఓట్ల రేటు అలా పెరిగి పోయింది. దాంతో రవి డేంజర్ జోన్ లోకి వెళ్లాడు. కాజల్ కు ఆమె స్నేహితుడు అయిన సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను వాడటం ద్వారా సేవ్ చేశాడు.
రవి మరియు కాజల్ లు చివర్లో ఉన్న సమయంలో కాజల్ వీక్ కనుక ఆమెను సేవ్ చేయాలనుకున్నాడు. రవి ఖచ్చితంగా సేవ్ అయ్యి ఉంటాడు.. రవిని సేవ్ చేయాల్సిన అవసరం లేదు.. కాజల్ ను సేవ్ చేస్తే ఈ వారం ఎలిమినేషన్ ఉండదని సన్నీ భావించాడు. కాని సన్నీతో పాటు ఇంటి సభ్యులు అంతా కూడా ఆశ్చర్యంతో షాక్ అయ్యేలా అనూహ్యంగా రవి ఎలిమినేట్ అయ్యాడు. కాజల్ కు సన్నీ ఎవిక్షన్ పాస్ ఇవ్వకున్నా సేఫ్ అయ్యేది అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. రవికి ఫ్యాన్ బేస్ భారీగా ఉంది. కాని వారు ఓటింగ్ విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపకుండా ఈజీగా సేవ్ అవుతాడని లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రవికి ఓట్లు తగ్గాయి. దాంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని బిగ్ బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.