పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి

Update: 2021-12-14 05:32 GMT
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 నుండి అనూహ్యంగా బయటకు వచ్చిన యాంకర్ రవి రెగ్యులర్ గా మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాడు. ఆయన మీడియాతో ఇంటరాక్ట్‌ అవ్వడంతో పాటు ఆయన గురించి మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఆమద్య ఆయన రీ ఎంట్రీ ఉంటుందని.. ఆయన అభిమానులు అన్నపూర్ణ స్టూడియో ముందు ఆందోళనకు దిగారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత కొన్ని రోజులు ఆయన హాలీడే కు వెళ్లడంతో కనిపించలేదు. మళ్లీ ఆయన ఇప్పుడు తెర ముందుకు వచ్చాడు. అయితే ఈసారి యాంకర్ రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వార్తల్లో నిలిచాడు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి తనపై తప్పుడు కామెంట్స్ చేసిన వారిపై చర్యలకు సిద్దం అయ్యాడు.

సైబర్ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి తనపై మరియు తన కుటుంబ సభ్యులపై కొందరు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశాడు. చిన్న పాప అయిన యాంకర్‌ రవి కూతురును ఉద్దేశించి కూడా కొందరు నీచంగా మాట్లాడటం.. కామెంట్స్ చేయడం చేశారు.

వారు ఎన్ని రకాలుగా అసహ్యంగా తనపై కామెంట్స్ చేసినా కూడా ఊరుకున్న యాంకర్ రవి తన భార్య మరియు పాప పై కామెంట్స్ చేయడంతో తట్టుకోలేక పోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

అందుకే ఏ ఒక్కరిని కూడా వదిలి పెట్టకుండా తాను అందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగ చెప్పుకొచ్చాడు. సోషల్‌ మీడియాలో తనను ఉద్దేశించి చేసిన ప్రతి బ్యాడ్‌ కామెంట్‌ కు సమాధానం చెప్పాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేశాడు.

యాంకర్ రవి బిగ్‌ బాస్ లో టాప్ కంటెస్టెంట్ గా నిలుస్తాడని అంతా అనుకున్నారు. అతడు ఎవరు ఏం అన్నా కూడా తనకు తాను ఆట ఆడుతూ అందరితో కలిసి పోయేలా ఉండేవాడు.

ఎవరితో అయినా గొడవ అయితే ఆ తర్వాత వెళ్లి మాట్లాడుకుంటూ కూల్‌ గా ఉండేవాడు. సోషల్ మీడియాలో యాంకర్‌ రవికి ఉన్న ఫాలోయింగ్‌ తక్కువేం కాదు. విజేతగా నిలువకున్నా టాప్‌ 3 వరకు అయినా ఖచ్చితంగా యాంకర్ రవి వెళ్తాడు అంటూ ప్రతి ఒక్కరు అనుకున్నారు.

కాని అనూహ్యంగా యాంకర్‌ రవి ఎలిమినేట్ అయ్యాడు. ఎన్నో వారాలుగా యాంకర్‌ రవి ఎలిమినేషన్ కు నామినేట్‌ అయ్యి సేవ్‌ అవుతూ వచ్చాడు. దాంతో ఆయన అభిమానులు ఓట్లు వేయడం లైట్‌ తీసుకున్నారు.

ప్రియాంక నామినేట్ అయ్యి ఉండగా రవి ని ఎలా ఎలిమినేట్‌ చేస్తారులే అనుకున్నారో మరేంటో కాని రవి కి తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు. రవి ఎలిమినేట్ అవ్వడం అందరికి షాక్ అనడంలో సందేహం లేదు.


Tags:    

Similar News