సుమ .. ఒక మాటల జలపాతం .. పంచ్ ల ప్రవాహం. సుమ స్టేజ్ పై ఉందంటే ఇక సమయమే తెలియదు. అంత గొప్పగా ఆమె యాంకరింగ్ ఉంటుంది. సుమ తరువాత వచ్చిన చాలామంది యాంకర్లు, ఆ తరువాత కాలంలో కనుమరుగయ్యారు. కానీ సుమ మాత్రం అలాగే దూసుకుపోతోంది. అందుకు కారణం .. ఆమె చురుకుదనం .. చలాకీదనం .. అందుకు తగిన సమయస్ఫూర్తి ఉండటం అనే చెప్పాలి. బాలసుబ్రమణ్యం వంటి గొప్ప గాయకుడిని 'తమ్ముడు బాలు' అంటూ సంబోధించడం చూస్తే, ఆమె తన మాటల ప్రవాహంతో ఏ స్థాయి వ్యక్తుల మనసులు గెలుచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇటు టీవీ షోల్లోను .. అటు సినిమా ఈవెంట్స్ లోను స్టేజ్ పై సుమ ఉందంటే పండగే .. నాన్ స్టాప్ సందడే అనే విషయం, అందరికీ ఎప్పుడో అర్థమైపోయింది. తాను కాగితంలో రాసుకున్న నాలుగు ముక్కలను స్టేజ్ పై చెప్పేసి ఒక పక్కకి వెళ్లి నిలబడటం సుమకి తెలియదు. ఒక్కోసారి స్టేజ్ పైకి వెళ్లిన తరువాత కొంతమంది టాపిక్ డైవర్ట్ చేస్తూ మాట్లాడుతుంటారు. అలాంటి సమయంలో వచ్చినవారికి ఇబ్బంది కలగకుండా ఆ టాపిక్ ను తెలివిగా కట్ చేసి, మాట్లాడేవారిని దార్లోకి తెచ్చే టాలెంట్ ఆమె సొంతం. ఇక స్టేజ్ పై గలగల మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట నోరు జారడం సహజంగా జరుగుతూ ఉంటుంది.
కానీ సుమ మాటల గారడీ చేస్తుంది .. పంచ్ లతో విన్యాసాలు చేస్తుంది. అదే సమయంలో తన వలన ఎవరూ నొచ్చుకోకుండా చూసుకుంటుంది. షోలో జోష్ తగ్గిందని అనిపించినప్పుడు తనపై తానే జోక్స్ వేసుకుని నవ్వించే విద్య ఆమెకి బాగా తెలుసు. ఇక తెలుగు సరిగ్గా రాని హీరోయిన్లను సున్నితంగా ఆమె ఆటపట్టించే తీరు .. టీవీల ముందు కూర్చున్న వాళ్లని కూడా హాయిగా నవ్వుకునేలా చేస్తుంది. సుమ దగ్గర కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని ఇటీవల ఒక సందర్భంలో త్రివిక్రమ్ అన్నాడంటే, ఆమె టాలెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి సుమ .. అప్పుడప్పుడు వేదికలపై సందర్భాన్ని బట్టి, తన భర్త రాజీవ్ కనకాల ప్రస్తావన కూడా తీసుకొస్తుంటుంది. సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా ఆయన కూడా బిజీగానే ఉన్నారు. ఈ మధ్య వచ్చిన 'నారప్ప' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన ఆయన, రీసెంట్ గా థియేటర్లకు వచ్చిన 'లవ్ స్టోరీ' సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. ఈ పాత్రలో ఆయన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, ఆయన పాత్రకు మంచి గుర్తింపు రావడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తన భర్త నటనను సుమ సోషల్ మీడియా ద్వారా అభినందించడం విశేషం.
"తమ నటనతో మనలను మెప్పించగల నటులు కొందరే ఉంటారు .. అలాంటి వాళ్లలో మా ఆయన రాజీవ్ కనకాల కూడా ఒకరు" అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక రాజీవ్ కనకాలను ఉద్దేశించి .. 'లవ్ స్టోరీ'లో ఆ తరహా పాత్రను పోషించినందుకు నువ్వెంత ఫీలై ఉంటావో నాకు తెలుసు. కానీ ఆ పాత్రతో ఎంతోమందిపై ప్రభావాన్ని చూపించావు" అంటూ తన స్వభావానికి పూర్తి విరుద్ధమైన పాత్రలో ఆయన నటించి మెప్పించాడనే విషయాన్ని గుర్తుచేశారు. "ఈ పాత్రను ఇంత సహజంగా .. గొప్పగా చేసినందుకు కంగ్రాట్స్" అంటూ అభినందనలు అందజేశారు.
"శేఖర్ కమ్ములగారు గొప్ప దర్శకుడు అనే విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ సినిమాలో సున్నితమైన అంశాలను ఆయన అంతకంటే సున్నితంగా ఆవిష్కరించిన తీరు .. ఆలోచింపజేసిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక నాగచైతన్య చాలా సింపుల్ గా కనిపిస్తూనే, సహజమైన నటనతో మెప్పించాడు. సాయిపల్లవి నటన గురించి .. డాన్స్ గురించి నేను కొత్తగా చెప్పేదేం ఉంది? ఆమె గురించి అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఆమె డాన్స్ చూసి నా కళ్లు నొప్పులు పుట్టాయి .. అంత పెద్దవి చేసి చూశాను మరీ" అంటూ ఈ సినిమా టీమ్ లోని సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు.