'భీష్మ' హిట్టుతో ఈ ఏడాది ఆరంభంలో బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటిన యువ హీరో నితిన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరసగా ప్రాజెక్టులు లైన్లో పెట్టి తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. నితిన్ సెట్ చేసుకున్న క్రేజీ ప్రాజెక్టులలో బాలీవుడ్ సూపర్ హిట్ 'అంధా ధున్' రీమేక్ ఒకటి. ఈ సినిమాకు ఎక్స్ ప్రెస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన మేర్లపాక గాంధీ దర్శకుడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి తాజాగా ఒక స్పైసీ టాక్ వినిపించింది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో హీరో ఆయుష్మాన్ ఖురానా - హీరోయిన్ రాధిక ఆప్టే ల మధ్య లిప్ లాక్స్ ఉన్నాయి. అయితే తెలుగులో కూడా స్టోరీ డిమాండ్ మేరకు లిప్ లాక్స్ ప్లాన్ చేస్తున్నారని.. అయితే హీరోయిన్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని వార్తలు వచ్చాయి. కారణం.. మహమ్మారి వల్ల వచ్చిన కొత్తరకం భయమేనని కొందరు అంటున్నారు. వారి భయం సంగతేమో కానీ ప్రేక్షకులకు ఈ ముద్దుముచ్చట్లు కూడా దూరమయ్యేలా ఉన్నాయని కొందరు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే నితిన్ సన్నిహితుల వెర్షన్ వేరేలా ఉంది.
అసలు ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలోనే ఉందని.. ఇంకా నటీనటులు.. టెక్నిషియన్ల ఎంపిక మొదలుపెట్టలేదని.. కీర్తి సురేష్.. ప్రియాంక మోహన్ ను సంప్రదించలేదని అన్నారు. ఇంతలోనే ఈ లిప్పులు.. లాకులు.. కిస్సుబుస్సుల వార్తలు ఏంటని చిరాకు పడుతున్నారు. ఇవన్నీ పసలేని రూమర్లు తప్ప మరొకటి కాదని కుండబద్దలు కొట్టారు. సో.. ఈలెక్కన నితిన్ భయ్యా లిప్పులాకుల గురించి కళాత్మక హృదయం ఉన్న తెలుగు ప్రేక్షకులు దిగులు పడాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు.
ఈ రీలు లిప్పు లాకుల స్టోరీ పక్కన పెడితే నితిన్ ఇక పర్సనల్ లైఫ్ లో కూడా సింగిల్ స్టేటస్ కు బై బై చెప్పి మారీడ్ లైఫ్ కు వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యాడు. పర్సనల్ లైఫ్ లో సెటిల్ కావడం తో పాటుగా ప్రొఫెషనల్ గా మరో మెట్టు ఎక్కేందుకు మంచి కథాబలం ఉన్న సినిమాలను లైన్లో పెట్టాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'రంగ్ దే' విడుదలకు సిద్ధంగా ఉంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కే మరో సినిమా.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న 'పవర్ పేట'.. ఈ 'అంధా ధున్' రీమేక్.. ఇలా ఈ లైనప్ చూస్తే ఈ సారి గట్టిగానే బాక్స్ ఆఫీస్ పై తన ముద్ర వేసేలా ఉన్నాడని అంచనాలున్నాయి.