నందికి అవమానం... సినిమాకు చిన్నతనం!

Update: 2015-01-21 07:43 GMT
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏటా సినీ, టీవీ రంగాల కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది! ఈ సారి నంది అవార్డుల ప్రదానాన్ని మూడుచోట్ల నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది! ఈ విషయంలో మాత్రం అన్ని ప్రాంతాలనూ సమానంగా చూడాలి భావించనట్లు...  విజయవాడలో ఉగాది రోజున నంది ఫిల్మ్‌ అవార్డులను,  అనంతపురంలో నంది టీవీ అవార్డులను, నంది థియేటర్‌ అవార్డులను రాజమండ్రిలోనూ నిర్వహించాలని కూడా నిర్ణయించారు! ఇంతవరకూ బాగానే ఉంది కానీ...  ప్రస్తుతం రెండు లక్షల రూపాయలుగా ఉన్న  అవార్డుల్లో ఇచ్చే పారితోషికాన్ని రూ.50 వేలకే పరిమితం చేస్తున్నారు! ఈ ఆలోచన ఏమిటి సార్‌ అని అడిగిన వారికి లోటు బడ్జెట్‌ అని సమాధానం ఇస్తోన్నారట ప్రభుత్వ పెద్దలు! ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! ఈ విషయంలో ఏకంగా ముఖ్యమంత్రి పైనే ప్రత్యక్ష విమర్శలు పడిపోతున్నాయి!

స్పెషల్‌ ఫ్లైట్స్‌ లో విదేశాలకు వెళ్లినప్పుడు లోటు బడ్జెట్‌ గుర్తుకు రాలేదా? భారీ స్థాయిలో ఖర్చు పెట్టి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లోటు బడ్జెట్‌ గుర్తుకురాలేదా? తండోపతండాలుగా సింగపూర్‌ స్పెషల్‌ ఫ్లైట్స్‌ లో వెళ్లినప్పుడు ఈ విషయం మరిచిపోయారా? అని ప్రతి ఒక్కరూ ఏపీ ప్రభుత్వ నిర్ణయన్ని వ్యతిరేకిస్తున్నారు! సరిగ్గా గమనిస్తే... ఈ అన్ని ప్రశ్నల్లోనూ న్యాయం ఉందని అనిపించక మానదు! మామూలుగా ప్రయాణించే విమాన ప్రయాణానికీ, స్పెషల్‌ ఫ్లైట్స్‌ లో ప్రయాణించే విమానానికీ సంబందించిన ఖర్చులో తేడాతో సుమారు రెండు, మూడు సార్లు నంది అవార్డ్‌ పంక్షన్స్‌ చేయొచ్చు అనేది పలువురి అభిప్రాయం!

ఈ క్రమంలో ఏ విషయంలోనూ తమ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయని బాబు అండ్‌ కో... సినిమా వాళ్ల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం లోటు బడ్జేట్‌ గుర్తుకు తెచ్చుకోవడం హాస్యాస్పదమని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు! ప్రభుత్వానికి సపోర్ట్‌ గా ఏ సమస్యకైనా 'మేముసైతం' అంటూ సహకరించే సినిమావాళ్ల విషయంలో ప్రభుత్వం ఇలా చిన్న చూపు చూడటం బాధాకరమని ఆర్టిస్టుల అభిప్రాయం! ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుల పారితోషికాన్ని పెంచకపోయినా పర్లేదు కానీ... తగ్గించే ఆలోచన చేయవద్దని సినీ ప్రముఖులు కోరుతున్నారు! ఇది అవగాహనా రాహిత్యంతో కూడిన నిర్ణయంగా వారు అభివర్ణిస్తున్నారు!

Tags:    

Similar News