ఇంకా హీరో ఎవ‌రో ఫైన‌లైజ్ చేయ‌లేద‌ట‌

Update: 2022-12-08 23:30 GMT
బాలీవుడ్ అగ్ర‌ క‌థానాయ‌కుడు అక్ష‌య్ కుమార్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ ఇటీవ‌ల ఎక్కువ‌గా హెడ్ లైన్స్ లోకి వ‌స్తున్నాడు నేటిత‌రం యువ‌హీరో కార్తీక్ ఆర్య‌న్. భూల్ భుల‌యా 2 ఘ‌న‌విజయం సాధించిన‌ త‌ర్వాత అత‌డి రేంజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు పాపుల‌ర్ ఫ్రాంఛైజీ 'హేరా ఫేరి 3' కోసం అక్షయ్ కుమార్ స్థానంలో కార్తిక్ ఆర్యన్ ని నిర్మాత‌లు ఎంపిక చేసార‌ని క‌థ‌నాలు రావ‌డం ఇటీవల సంచలనం సృష్టించింది.

కానీ ఈ వార్త‌ల‌న్నీ నిజ‌మేనా? అన్న‌ది ఆరా తీస్తే ర‌క‌ర‌కాల సంగ‌తులు తెలిసాయి. మోస్ట్ అవైటెడ్ 'హేరా ఫేరి 3'లో అక్షయ్ కుమార్ స్థానంలో కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నాడన్న క‌థ‌నాలు పూర్తిగా అధికారికం కాదు. అందులో నిజం ఎంతో నమ్మేందుకు లేదు. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి నిర్మాత‌లు అనీస్ బాజ్మీ ని సంప్ర‌దించ‌గా అత‌డు మూడవ భాగం క‌థాంశం తనకు ఇంకా చెప్పలేదని పేర్కొన్నారు. ఈ ఫ్రాంచైజీలో కార్తీక్ లేదా అక్షయ్ నటించ‌నున్నార‌ని తెలుసు అని వ్యాఖ్యానించారు.

అనీస్ బాజ్మీ మాట్లాడుతూ, ''ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ లేదా అక్షయ్ కుమార్ ఇద్ద‌రిలో ఎవ‌రు నటిస్తారో నిర్మాతలు నాకు ఇంకా చెప్పలేదు'' అని కూడా వ్యాఖ్యానించారు. అయితే బ‌జ్మీ కార్తీక్ పేరును ప్ర‌స్థావించ‌డంతో ఇప్పుడు అత‌డినే ఖ‌రారు చేసిన‌ట్టేన‌ని మ‌రోసారి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అనీష్‌ బజ్మీ మాట్లాడుతూ, ''హేరా ఫేరి 3కి దర్శకత్వం వహించడానికి నన్ను సంప్రదించారు. నా డేట్ లను సిద్ధం చేస్తున్నాను. నిర్మాతలు కార్తీక్ ఆర్య‌న్ గురించి కానీ.. అక్షయ్ గురించి కానీ చెప్పలేదు. ఈ సినిమాకు నేనే దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాబట్టి నేను నా కాల్షీట్ల వ‌ర‌కూ చ‌ర్చించాను.

ఈ నిర్మాత‌ల‌తో నేను ఇప్పటికే రెండు చిత్రాలకు ప‌ని చేసాను... దర్శకత్వం వహించాను - వెల్‌కమ్ - వెల్‌కమ్ బ్యాక్..ల‌కు ప‌ని చేసాను. వెల్‌కమ్ 3ని కూడా తీయాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం నేను నా ఇత‌ర సినిమాలతో బిజీగా ఉన్నాను. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో కాల‌మే స‌మాధానం ఇవ్వాలి'' అని అన్నారు.

హేరా ఫేరి 3 ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే హెడ్  లైన్స్ లో నిలుస్తోంది. కొన్నేళ్లుగా ఈ ఫ్రాంచైజీ బ్రాండ్ పేరుకు అలాంటి క్రేజ్ ఉంది. బాజ్మీ - కార్తీక్ కాంబినేష‌న్ 'హేరా ఫేరి 3'తో తెర‌పైకి వస్తే అది సూపర్  బ్లాక్ బ‌స్ట‌ర్ భూల్ భూలయ్యా 2 తర్వాత ఈ జోడీ నుంచి వెంట‌నే మ‌రో సంచ‌ల‌నం గా న‌మోద‌వుతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News