బాలీవుడ్ మేకర్ అనీస్ బజ్మీ తెరకెక్కించిన 'భూల్ భులయ్యా-2' ఇటీవల విడుదలై ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. వరుస ప్లాప్ లతో సతమతమవుతోన్న బాలీవుడ్ కి కాస్త ఊపిరి పోసిన చిత్రంగా నిలిచింది. 'గంగుబాయి కతియావాడి' తర్వాత బాలీవుడ్ కి దక్కిన సక్సెస్ పుల్ చిత్రంగా భూల్ భులయ్యా-2 నిలిచింది. దీంతో దర్శకుడు అనీస్ బజ్మీ పేరు నెట్టింట హాట్ టాపిక్ మారింది.
ఇప్పుడీ యంగ్ డైరెక్టర్ కి ఆ సక్సెస్ మంచి అవకాశాలు తెచ్చిపెడుతుంది. అనీస్ బజ్మీ బాలీవుడ్ ఇండస్ర్టీలో చాలా కాలం నుంచి ఉన్నారు. కానీ అవకాశాలు రాక సినిమాలు చేయలేదా? కథలు కుదరక డిలే చేసారా? అన్నది క్లారిటీ లేదు గానీ..అనీస్ సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువగానే కనిపిస్తుంది.
ఆ సంగతి పక్కనబెడితే భూల్ భులయ్యా2 తర్వాత అనీస్ కి అవకాశాల వెల్లువ మొదలైంది.
చాలా మంది బాలీవుడ్ నిర్మాతలిప్పడు అతనితో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. కానీ ఆయన మాత్రం చాలా సెలక్టివ్ గానే నిర్మాతల్ని లాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాని నిర్మాతలతోనే సినిమాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇంత సెలక్టివ్ గా వెళ్తున్నట్లు తెలుస్తోంది. జీస్టూడియోస్-ఎజిలాన్ ప్రొడక్షన్స్ సంస్థలతో ఓసినిమా చేయడానికి అనీస్ టైఅప్ అయ్యారు.
నిర్మాతల్లో ఒకరైనా షారిక్ పటేల్ మాట్లాడుతూ..' అనీస్ తో కలిసి పనిచేసేందుకు చాలా సంతోషంగా ఉన్నాం. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అనీస్ తప్పకుండా అందరికీ నచ్చే ఓ మసాలా సినిమాతోనే ప్రేక్షకుల ముందుకొస్తారు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. వచ్చే ఏడాది ద్వితియార్ధంలో సినిమా రిలీజ్ అవుతుంది' అని' తెలిపారు.
అనీస్ బజ్మీ 'హల్చల్' సినిమాతో బాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయమయ్యారు. అటుపై 'నో ఎంట్రీ'..'సాండ్ విచ్'.. 'సింగ్ ఈజ్ కింగ్'.. 'థాంక్యూ'..'వెల్కమ్ బ్యాక్'.. 'రెడీ' లాంటి చిత్రాలు తెరకెక్కించారు. రచయితగానూ చాలా సినిమాలకు పనిచేసారు. దర్శకుడిగా పరిచయమైన తర్వాత రైటర్ గా పలు సినిమాలకు కథ..కథనాలు అందించారు. అక్కడా సక్సెస్ అయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.