వరల్డ్‌ ఫేమస్‌ నటికి ఎంత కష్టమొచ్చింది!

Update: 2018-11-21 01:30 GMT
హాలీవుడ్‌ హీరోయిన్‌ ఏంజెలీనా జోలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ఏంజెలీనా జోలీ ప్రస్తుతం ఆ ర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లుగా హాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మీడియాల్లో ఈ విషయమై పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. హీరోయిన్‌ గా ఎన్నో మంచి చిత్రాల్లో నటించి - భారీ ఎత్తున సంపాదించిన ఏంజెలీనా జోలీ హీరోయిన్‌ గా స్టార్‌ డం ఉన్న సమయంలోనే దర్శకురాలిగా మారింది. దర్శకురాలిగా మంచి సినిమాలు చేసినా కూడా ఆర్థికంగా మాత్రం అంతగా ఆమెకు కలిసి రావడం లేదు.

ఆర్థికంగా ఏంజెలీనా జోలీ ప్రస్తుతం నిలదొక్కుకునేందుకు విపరీతంగా ప్రయత్నం చేస్తోందట. దర్శకురాలిగా గోల్డెన్‌ గ్లోబ్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చినా కూడా ఏంజెలీనా మళ్లీ హీరోయిన్‌ గా నటించేందుకు సిద్దం అయ్యింది. ఈమె ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేయాలని భావిస్తోంది. దర్శకత్వంపై ఫోకస్‌ పెట్టిన కారణంగానే ఏంజెలీనా ఆర్థికంగా నష్టపోయిందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అవుతుందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల నిర్మాణ భాగస్వామ్యంలో కూడా ఆమె భాగస్వామ్యం అయ్యిందని, అందుకే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మరో వైపు ఏంజెలీనా ఫ్యామిలీ లైఫ్‌ కూడా అంత ఆనందదాయకంగా లేదు. భర్త బ్రాడ్‌ పిట్‌ తో విడిపోయేందుకు ఏంజెలీనా సిద్దం అయ్యింది. వీరిద్దరికి విడాకులు దాదాపుగా ఖరారు అయ్యాయి. అయితే వీరి పిల్లల కస్టడీ విషయమై కోర్టులో వాదనలు వినిపిస్తున్నాయి. 43 ఏళ్ల ఏంజెలీనా మళ్లీ మునుపటి స్థాయికి చేరుకోగలదా అనేది చూడాలి.

Tags:    

Similar News