హీరోయిన్ నగ్న చిత్రాలు వేలానికి సిద్ధం!

Update: 2015-09-02 12:40 GMT
ఏంజెలీనా జోలీ... ప్రపంచ‌వ్యాప్తంగా ఎంతోమందికి డ్రీమ్‌ గాళ్‌. వ‌య‌సు నాలుగు ప‌దులు దాటుతున్నా కూడా... త‌న అందాల‌ను ఏమాత్రం త‌గ్గ‌నీయ‌కుండా మెరుగులు దిద్దుకుంటూ కాపాడుకొస్తోందీ ఏంజెల్‌. భ‌ర్త బ్రాడ్‌పిట్ తో క‌ల‌సి తాజాగా ఓచిత్రంలో న‌టించింది. ఇదో రొమాంటిక్ డ్రామా జాన‌ర్ ఫిల్మ్‌. ఈ చిత్రంలో న‌టించ‌డంతోపాటు ర‌చ‌నా బాధ్య‌త‌లు కూడా నిర్వ‌హించింది జోలీ. భార్యాభ‌ర్త‌లు ఫ్రాన్స్‌ లో పర్య‌టించ‌డం అనే త్రెడ్ మీద ఈ రొమాంటిక్ డ్రామా కొన‌సాగుతూ ఉంటుంది. అయితే... ఇప్పుడు ఈ సినిమా గురించి ప్ర‌పంచ‌మంతా ఎంత క్రేజీగా చ‌ర్చించుకుంటున్నారో... దీంతోపాటే మ‌రో హాట్ న్యూస్ గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు.

స‌రిగ్గా ఇర‌వయ్యేళ్ల క్రితం... అంటే 1995లో ఏంజెలీనా ఏజ్ 20 క‌దా! ఇప్పుడే ఇలా ఉందంటే... అప్పుడు ఆమె అందాలు ఏ రేంజిలో ఉంటాయో ఒక్క‌సారి ఊహించుకోండి! అప్పుడు ఆమె కొన్ని న‌గ్న చిత్రాల‌కు ఫోజులు ఇచ్చింది. కేట్ గార్న‌ర్ అనే ఫొటోగ్రాఫ‌ర్ ఈ న్యూడ్ స్టిల్స్‌ ను తీశాడ‌ట‌. ఆ ఫొటోల గ్యాల‌రీ ఇప్పుడు లండ‌న్‌ లో వేలం వేయ‌బోతున్నారు. లండ‌న్‌ లోని జీబ్రావ‌న్ గ్యాల‌రీ ఇందుకు సిద్ధ‌మౌతోంది. అస‌లే ఏంజెల్ లాంటి జోలీ... అదీ ఇర‌వయ్యేళ్ల వ‌య‌సులో... అవి మామూలు చిత్రాలు కావు... న‌గ్న చిత్రాలు... వేలం వేస్తున్నారన‌గానే హైప్ క్రియేట్ కాక మానుతుందా..? ఇప్పుడు అంత‌ర్జాతీయ ఫిల్మ్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా నిలుస్తోంద‌ట‌.  అయితే, బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ఉన్న చిత్రాల‌కు ఎంత ధ‌ర ప‌ల‌క‌వ‌చ్చ‌ని అనుకుంటున్నారో తెలుసా.. ఒక్కో చిత్రానికి దాదాపు రూ.2 ల‌క్ష‌ల రూపాయ‌లు! ఇది జ‌స్ట్ అంచ‌నా మాత్ర‌మే. వేలం అన్నాక‌... ఆ రేటు ఎన్ని రెట్లు పెరుగుతుందో ఎవ‌రు మాత్రం ఊహించ‌గ‌ల‌రు!
Tags:    

Similar News