యాంగ్రీ యంగ్ మెన్ బ‌రిలోకి దిగేస్తున్నాడు

Update: 2022-04-16 14:30 GMT
యాంగ్రీ యంగ్ మెన్ డా. రాజ‌శేఖ‌ర్ 'పీఎస్‌వీ గ‌రుడ‌వేగ‌' చిత్రంతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. ఈ సినిమా విజ‌యంతో స‌రికొత్త జోష్ ని సొంతం చేసుకున్న రాజ‌శేఖర్ ఈ సినిమా త‌రువాత అదే జోరుతో యంగ్ డైరెక్ట‌ర్  ప్ర‌శాంత్ వ‌ర్మ‌ తెర‌కెక్కించిన 'కల్కి'చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఈ సినిమా కూడా విజ‌యం సాధించ‌డంతో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కులని అల‌రించాల‌ని, స‌రికొత్త పాత్ర‌ల్లో న‌టించాల‌ని ఫిక్స‌య్యారు. ఇందులో భాగంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం 'శేఖ‌ర్‌'.

2018లో వ‌చ్చిన మ‌ల‌యాళ చిత్రం 'జోసెఫ్' ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. పెగాస‌స‌న్ సినీ కార్ప్‌, తౌరుర్ సినీ కార్ప్, సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపీఎల్‌, త్రిపుర క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్ పై బీరం సుధాక‌ర్ రెడ్డి, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, వెంక‌ట శ్రీ‌నివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవితా రాజ‌శేఖ‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాజ‌శేఖ‌ర్ పెద్ద కుమార్తె శివాని కీల‌క పాత్ర‌లో న‌టించింది. విశేషం ఏంటంటే నిజ‌జీవితంలో తండ్రీ కూతుళ్లైన రాజ‌శేఖ‌ర్‌, శివాని ఇందులోనూ నిజ జీవిత పాత్ర‌ల్లోనే న‌టించారు.

ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ స్టోరీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ త‌న పంథాకు భిన్నంగా చేస్తున్న 91వ సినిమా ఇది. ఇందులో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో స్కేరీ మ్యాన్ గా రాజ‌శేఖ‌ర్ క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.  

ఈ మూవీపై రాజ‌శేఖ‌ర్ తో పాటు జీవిత భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. మ‌ల‌యాళంలో 'జోసెఫ్‌' పేరుతో రూపొందిన చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో ఆ మూవీ ఆధారంగా తెలుగు నేటివిటీకి భారీ మార్పులు చేసి రూపొందించిన ఈ మూవీ పై మంచి బ‌జ్ క్రియేట్ అయింది.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్ లో రాజ‌శేఖ‌ర్ మేకోవ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. అంతే కాకుండా ఇటీవ‌ల 'ల‌వ్ గంట మోగిందంటే' అనే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. ఇది కూడా విశేషంగా ఆక‌ట్టుకుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 20న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఆత్మీయ ర‌జ‌న్‌, ముస్కాన్, అభిన‌వ్ గోమ‌ఠం, క‌న్న‌డ కిషోర్‌, స‌మీర్‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ర‌వివ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రాఘ‌వేంద్ర త‌దిత‌ర‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి ఆర్ట్ సంప‌త్ - ద‌త్‌, మాట‌లు ల‌క్ష్మీ భూపాల‌, ఛాయాగ్ర‌హ‌ణం మ‌ల్లిఖార్జున్ న‌ర‌గ‌ని, సంగీతం అనూప్ రూబెన్స్‌, స‌మ‌ర్ప‌ణ వంకాయ‌లపాటి ముర‌ళీకృష్ణ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం జీవితా రాజ‌శేఖ‌ర్‌.
Tags:    

Similar News