అనిల్ కపూర్ తనయుడు, వర్ధమాన హీరో హర్షవర్థన్ కపూర్ తన ప్రేయసి సప్నా పాబీతో విడిపోయాడు. అయితే, వీరిద్దరూ విడిపోవడానికి అనిల్ కపూరే కారణమట. రీల్ లైఫ్ లో హీరో అయిన అనిల్ కపూర్ కొడుకు విషయంలో రియల్ లైఫ్ లో విలన్ లా ప్రవర్తించారట. '24' సినిమాలో అనిల్ కపూర్ కూతురిగా నటించిన సప్నాతో హర్షవర్థన్ ప్రేమలో పడ్డారు. యువజంట ప్రేమలోకాల్లో విహరించింది. విషయం అనిల్ కపూర్ కు తెలియడంతో కొడుక్కి క్లాస్ తీసుకున్నాడట. కెరీర్ ఆరంభంలో ప్రేమాదోమా అంటూ తిరిగితే మంచిది కాదని సలహాయిచ్చాడట. నీతో పాటు ఆమె కెరీర్ కూడా పాడవుతుందని చెప్పాట.
మొదట నాన్న మాటను పెద్దగా పట్టించుకోలేదట హర్షవర్ధన్. కానీ... తండ్రి అదే పనిగా ఫాలో అప్ చేయడం... ఆ అమ్మాయిని వదిలించుకోవాలని పదేపదే సూచించడంతో సప్నాకు కటీఫ్ చెప్పక తప్పలేదట. హర్షవర్ధన్ లవ్ విషయంలో అక్కడ సోనమ్ కపూర్ కూడా ఎంటరై బాగా బ్రెయిన్ వాష్ చేసిందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. 'మిర్జియా' సినిమాతో హర్షవర్థన్ హీరోగా బాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు 'రంగ్ దే బసంతి' ఫేమ్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ వర్గాల్లో హర్షవర్ధన్ హాట్ టాపిగ్గా మారిపోయాడు.