F3 క్రింజ్ కామెడీ అనే వారికి డైరెక్టర్ స్వీట్ కౌంటర్

Update: 2022-11-23 13:30 GMT
మొదట రైటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్నాడు. అతను చేసిన సినిమాలన్నీ కూడా దాదాపు కమర్షియల్ గా నిర్మాతలకు మంచి ప్రాఫిట్ అయితే అందించాయి. ప్రతిసారి కూడా ఈ దర్శకుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే ఎదుర్కొంటున్నాడు.

దాదాపు మినిమం ఆడియన్స్ ను అయితే థియేటర్లకు రప్పించగలిగే మంచి కమర్షియల్ సినిమాలను అనిల్ తెరపైకి తీసుకువస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాతకు నష్టాలు రాకుండా ఉండడమే తన ధ్యేయమంటూ చాలా సార్లు అతను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ తనది క్రింజ్ కామెడీ అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారికి ఒకటే సమాధానం చెప్పాడు.

'నా సినిమాలను ఆదరించే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు నేను వాళ్ళ కోసం సినిమాలు తీస్తున్నా..అందరికి అన్ని సినిమాలు నచ్చాలని లేదు..' అని అనిల్ చాలా స్వీట్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసాడు. అలాగే కామెడీ అనేది అంత ఈజీ కాదు అని అందరిని నవ్వించాలి అంటే కూడా చాలా సులభం కాదు అని అన్నారు.

అయితే నవ్వించడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరినీ గౌరవిస్తానని కామెడీ చేసే క్రమంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగ వచ్చేమో కానీ నవ్వించాలని ప్రయత్నం మాత్రం మాకెప్పుడు నచ్చుతుంది అని చాలా సింపుల్ వివరణ అయితే ఇచ్చాడు.

ఇక మహేష్ బాబుతో కూడా మరో సినిమా చేయాల్సి ఉంది అని ప్రస్తుతం త్రివిక్రమ్ రాజమౌళి ప్రాజెక్టులో లైన్లో ఉన్నాయి కాబట్టి నా స్లాట్ దొరికేందుకు ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు అని అన్నాడు. అయితే మహేష్ బాబు గారు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా తాను రెడీగా అంటూ.. అంతేకాకుండా భవిష్యత్తులో మాత్రం కేవలం ఒకే జానర్ సినిమాలు కాకుండా విభిన్నమైన సినిమాలను కూడా చేయాలని ఉంది అని అనిల్ అన్నాడు.

ముఖ్యంగా డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో కూడా సినిమా చేస్తాను అంటూ.. తిరుపతి వెంకటేశ్వర స్వామి తనకు ఇష్టమైన దైవం అంటూ ఎప్పటికైనా కాస్త ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని ఆలోచన కూడా ఉన్నట్లు చెప్పాడు. అయితే ఇప్పుడున్న అనుభవం మాత్రం సరిపోదు అని దానికి మరొక మూడేళ్ల సమయం పట్టవచ్చు అని కూడా అనిల్ తెలియజేశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News