నందమూరి బాలకృష్ణ గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూశారు. అలాంటి ఆయనకు గత ఏడాది డిసెంబర్ లో మాస్ మసాలా యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను 'అఖండ' రూపంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించారు. ఈ హిట్ తో బాలయ్య రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశారు. యాభై శాతం ఆక్యుపెన్సీ టైమ్ లో 'అఖండ' రికార్డు స్థాయి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సంచనం సృష్టించింది. ఈ మూవీ తరువాత ఆయన మరో యాక్షన్ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఫస్ట్ ఎటాక్ పేరుతో ఇటీవలే ఈ మూవీ టీజర్ ని విడుదల చేశారు. బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో లుంగీ ధరించి పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన తీరు ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ టీజర్ లో బాలయ్యని ప్రజెంట్ చేసిన తీరు, ఆయన పలికిన సంభాషణలు అభిమానులకు ఒక విధంగా పూనకాలు తెప్పించాయి.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత బాలకృష్ణ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ మాస్ మసాలా యాక్షన్ మూవీని చేయబోతున్నారు. 'ఆహా' టాక్ షో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకె' సీజన్ 2 కు రెడీ అవుతున్న బాలయ్య దీనితో పాటు అనిల్ రావిపూడి మూవీకి కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇటీవల 'ఎఫ్ 3' ప్రమోషన్స్ లో దర్శకుడు వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చింది. సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు దాటిన వ్యక్తిగా, ఓ యువతికి తండ్రిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాలో ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తోంది.
అంతే కాకుండా ఈ పాత్ర కోసం సరికొత్త మేకోవర్ లో బాలయ్య కనిపించబోతున్నారట. క్యారెక్టర్ లుక్ చాలా కొత్తగా వుంటుందని, నెవర్ బిఫోర్ అవతార్ లో బాలయ్యని చూపించబోతున్నానని, ఫ్యాన్స్ కి ఇక పూనకాలే నని దర్శకుడు భారీ కాన్ఫిడెన్స్ తో వున్నట్టుగా తెలుస్తోంది.
అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య లుక్ కి సంబంధించిన వర్క్ చేస్తున్నారు. ఇటీవలే జూన్ 10న బాలయ్య పుట్టిన రోజున ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకున్న స్థాయిలో లుక్ పర్ఫెక్ట్ గా రాకపోవడంతో ఆ ఆలోచనని వాయిదా వేసుకున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారట. టెక్నికల్ టీమ్, నటీనటుల విరాల్ని త్వరలో వెల్లడించి మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది.