టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ తన కథల్లో ఎక్కడ ఎలా సర్దాలనే విషయం ఆయనకి బాగా తెలుసు. అందువలన తన మొదటి సినిమా అయిన 'పటాస్' నుంచి ఇంతవరకూ ఆయనకి పరాజయమనేది తెలియదు. కథ ఏదైనా అందులో ఆయన కామెడీకి ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఆయన నుంచి వచ్చిన 'ఎఫ్ 3' సినిమా కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
"చిన్నప్పటి నుంచి నాకు సినిమా పిచ్చి ఎక్కువగానే ఉండేది. కాలేజ్ రోజుల్లో నేను గుంటూరులో విపరీతంగా సినిమాలు చూసేవాడిని. బీటెక్ లో చదువుపై ధ్యాస తగ్గింది .. అది కాస్తా కానిచ్చేసి సినిమాల్లోకి వచ్చాను. ఇండస్ట్రీకి రావాలనే తప్ప .. ఇక్కడ ఏం చేయాలనే ఒక క్లారిటీ లేదు.
బాబాయ్ అరుణ్ ప్రసాద్ ఇండస్ట్రీలో ఉండటం వలన .. వచ్చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా నా ప్రయాణం మొదలైంది. ఆ తరువాత నేను రైటర్ గా మారాను. అప్పట్లో జీతం చాలా తక్కువ .. అందువలన డబ్బులు సరిపోయేవి కాదు. అలాగని కష్టాలు పడలేదు. మా అక్కయ్య వాళ్లు .. మా పెద్దమ్మ వాళ్లు హైదరాబాద్ లో ఉండేవారు. అందువలన డబ్బుకి .. ఫుడ్డుకు ఇబ్బంది పడలేదు.
సినిమాల్లోకి వచ్చినప్పుడు అందరికీ ఉండే కష్టాలు .. నేను పడలేదు. మా నాన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్. అప్పట్లో జీతాలు చాలా తక్కువ .. అయినా ఆయన నన్ను రిచ్ గానే పెంచారు .. అన్నీ ఖరీదైనవే కొనిపెట్టేవారు.
అలా చిన్నప్పుడు .. సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా నేను కష్టపడింది లేదు. ఒకప్పుడు జంధ్యాల గారు .. ఆ తరువాత ఈవీవీ గారు పూర్తిస్థాయి కామెడీ సినిమాలు చేశారు. శ్రీను వైట్ల తరువాత ఆ స్పేస్ ఖాళీగా ఉండటంతో నేను వచ్చేశాను .. 'ఎఫ్ 2'తో పూర్తి స్థాయి కామెడీ సినిమాను చేశాను. ఆ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది
'పటాస్' నుంచి నేను చేసిన ప్రతి సినిమా వెనుక దిల్ రాజు ఉన్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తరువాత నా వెల్ విషర్ ఆయనే అని చెప్పచ్చు. ఇక గాడ్ ఫాదర్ ఎవరంటే మా బాబాయ్ అనే చెబుతాను. ఎందుకంటే నన్ను ఇండస్ట్రీకి తీసుకుని వచ్చింది .. ఎంకరేజ్ చేసింది ఆయనే. నేను సినిమాలు ఎక్కువగా చూడటం వలన .. ఏ సీన్ కి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది నాకు బాగా తెలుసు. దానిని బట్టే నేను నా సినిమాల్లోని సీన్స్ ను డిజైన్ చేసుకుంటూ ఉంటాను. నేను సినిమాలు బాగా తీయడానికి కారణం .. అంతకుముందు సినిమాలు బాగా చూడటమే" అని చెప్పుకొచ్చాడు.