సంక్రాంతి రేస్ లో సైలెంట్ కిల్లర్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన ఎఫ్2 దర్శకుడు అనిల్ రావిపూడి డిమాండ్ మాములుగా లేదు. సింపుల్ కథను తనదైన శైలిలో హాస్యాన్ని జోడించి మెప్పించిన తీరు ఏకంగా 60 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ వసూళ్ళను తెచ్చి ఇంకా దూసుకుపోయేలా చేస్తోంది. వెంకటేష్ వరుణ్ తేజ్ లతో పాటు తనకూ కెరీర్ బెస్ట్ ఇచ్చుకున్న అనిల్ రావిపూడికి అగ్ర నిర్మాతలు మొదలుకుని తనతో చేయాలనీ గతంలోని మాట్లాడిన వాళ్ళ దాకా వరస ఫోన్ కాల్స్ తో సెల్ మ్రోగుతూనే ఉందట.
ఇలాంటి సక్సెస్ వచ్చినప్పుడు ఇది సహజంగా జరిగేదే. ఎఫ్2 విడుదల తర్వాత ఇంటర్వ్యూలలో చాలా హుషారుగా కనిపిస్తున్న అనిల్ రావిపూడి పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ తో పటాస్ సూపర్ తో పాటు అతని కెరీర్ కి పెద్ద బ్రేక్ ఇచ్చిన అనిల్ తర్వాత తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఒక లైన్ వినిపించాడట. గంటన్నర నేరేషన్ కే బాగా ఇంప్రెస్ అయిపోయిన తారక్ ఫుల్ స్క్రిప్ట్ ని డెవలప్ చెసుకుని వస్తే ఫలానా డేట్ లోపు షూటింగ్ మొదలుపెడదామని డేట్స్ ఉన్నాయని చెప్పాడట.
అయితే అంత తక్కువ వ్యవధిలో మొత్తం స్క్రిప్ట్ అంటే న్యాయం చేయలేనేమో అని భావించిన అనిల్ దాన్ని ఇష్టం లేకపోయినా డ్రాప్ అయ్యాడు. లేకపోతే మాస్ ఇమేజ్ తక్కువగా ఉన్న అన్ననే ఆ రేంజ్ లో చూపించినప్పుడు ఇక మాస్ తో యంగ్ టైగర్ గా పిలిపించుకునే తమ్ముడితో ఎలాంటి సినిమా తీసేవాడో. అయితే వేర్వేరు కమిట్మెంట్స్ కారణంగా ఇప్పటికిప్పుడు ఈ కాంబో కుదరదు కాని ఫ్యూచర్ లో ఎప్పుడు జరిగినా అభిమానులకు కనులపండగే.