కొత్త సినిమా రిలీజవడం ఆలస్యం.. ఒకట్రెండు రోజుల్లోనే పైరసీ ప్రింటు బయటికి వచ్చేస్తున్న రోజులివి. పైరసీ ప్రింట్లు చూడటంలో జనాలు పెద్దగా మొహమాటం కూడా పడట్లేదు. బస్సుల్లో.. రైళ్లల్లో.. పబ్లిక్ ప్లేసుల్లో పైరసీ వెర్షన్లు యథేచ్ఛగా చూసేస్తున్నారు జనాలు. ఇంతకుముందైతే పైరసీ సీడీల్ని పెట్టుకుని టీవీల్లో సినిమాలు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడందరూ మొబైళ్లలో.. ల్యాప్ టాపుల్లో సినిమా చూసేస్తున్నారు. తాజాగా ‘రాజా ది గ్రేట్’ సినిమాను ఓ మహిళ ఎయిర్ పోర్టు లాంజ్ లో ల్యాప్ టాప్ లో పెట్టుకుని చూస్తుండగా ఓ టాలీవుడ్ పీఆర్వో చూసి ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టాడు. ఈ ట్వీట్ చూసి ‘రాజా ది గ్రేట్’ దర్శకుడు అనిల్ రావిపూడి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఫేస్ బుక్ లో చాలామంది ‘రాజా ది గ్రేట్’ పైరసీ లింకుల్ని పోస్ట్ చేస్తున్నారని.. ఇలా చేయడం సరికాదని.. దయచేసి పైరసీ నుంచి తెలుగు సినిమాను కాపాడాలని విజ్నప్తి చేశాడు అనిల్ రావిపూడి. ‘రాజా ది గ్రేట్’ విడుదలైన రెండో రోజుకే ఈ సినిమా పైరసీ బయటికి వచ్చేసింది. మొబైళ్ల ద్వారా సినిమా సర్కులేట్ అవుతోంది. పైరసీని ఆపేందుకు పరిశ్రమ వైపు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఈ సమస్య తీరడం లేదు. ఐతే కొత్త సినిమాలకు టికెట్ల రేట్లు పెంచి అమ్ముతుండటం వల్ల పైరసీ చూడక ఏం చేస్తాం అంటూ అసహనం వ్యక్తం చేసేవాళ్లూ లేకపోలేదు. సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ ప్రశ్నకు ఇండస్ట్రీ నుంచి సమాధానం ఉండట్లేదు.